India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దపల్లి జిల్లా బోజన్నపేటలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని త్రివేణి రైస్‌మిల్లులో ఈ ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్ కారణంతో గోదాంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు.
RMP వైద్యం వికటించడంతో ఓ వివాహిత మృతి చెందిన ఘటన KNR జిల్లా శంకరపట్నం మండలంలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకానం.. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన సాయిల్ల స్వప్న గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈక్రమంలో కేశవపట్నంలోని ఓ RMPని సంప్రదించగా వైద్యం అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబీకులు RMPకి చెప్పడంతో KNR వెళ్లమని సూచించారు. కాగా, మార్గమధ్యలో స్వప్న మృతిచెందింది.
పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. ధర్మారం మండలం సాయపేటకు చెందిన ఓదెలు(35) ఎనిమిది నెలల క్రితం అప్పులు చేసి దుబాయి వెళ్లాడు. తనది పర్యాటక వీసా కావడంతో మోసపోయానని కుటుంబీకులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో స్వగ్రామానికి రావడానికి భార్య, తల్లితో డబ్బు కావాలని అన్నాడు. తీరా అతడి నుంచి కాల్ రాకపోవడంతో పోలీసులను, MLAను కలిశారు. వారు సమాచారం కనుక్కోగా మరణించినట్లు తెలిసింది.
జమ్మికుంట పత్తి మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ఇస్తున్నట్లు కార్యదర్శి మల్లేశం తెలిపారు. ఈనెల 17న శనివారం వారాంతపు యార్డు బంద్, 18న ఆదివారం సాధారణ సెలవు, 19న సోమవారం రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా సెలవు ఉన్నట్లు తెలిపారు. తిరిగి 20న మంగళవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని, రైతులు గమనించి సహకరించాలన్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కేసు నిందితుడి విచారణలో సంచలన విషయాలు బయట పడ్డాయి. నిందితుడు నాగేశ్, అతని భార్య లావణ్య 3 నెలల్లో ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేసి ఇద్దరిని ఈ ఏడాది జూన్‌లో అమ్మినట్లు తేలింది. జూన్‌లో ఆరేళ్ల పాపతో పాటు మూడేళ్ల పాపను కిడ్నాప్ చేసి ఒకరిని రూ.2 లక్షలకు, మరొకరిని రూ.1.50 లక్షలకు అమ్మినట్లు తెలుస్తోంది. ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారనే విషయాలు తెలియాలి.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆరేళ్లకు భర్త ముఖం చాటేశాడు. బాధితురాలి ప్రకారం.. ముల్కనూరుకు చెందిన రంజిత్ రాజమండ్రి(AP)లోని ఓ ఆస్పత్రిలో పని చేస్తూ అక్కడే నర్స్‌గా పని చేస్తున్న చంద్రకళను 2018లో పెళ్లి చేసుకున్నాడు. జులై9న స్వగ్రామం వచ్చి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులతో కలిసి బాధితురాలు ముల్కనూర్ వచ్చింది. భర్త కుటుంబీకులు కట్నం తేవాలంటున్నారని, వారినుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమ్మమ్మ తనతో మాట్లాడట్లేదని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమదేవపల్లిలో గురువారం చోటుచేసుకుంది. SI సాయిబాబ వివరాల ప్రకారం.. భీమదేవరపల్లికి చెందిన నిఖిత KUలో PG చేస్తూ మణికొండలోని ఓ ప్రైవేటు కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తోంది. అయితే నిఖితకు HZBలో ఉంటున్న అమ్మమ్మ వెంకటమ్మ అంటే ఇష్టం. ఇటీవల నెలకొన్న మనస్పర్ధల కారణంగా అమ్మమ్మ భీమదేవరపల్లికి రాకపోవడంతో మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత పంట రుణమాఫీ నిధులను విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 41,944 మంది రైతులు ఉన్నారు. మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల లోపు రుణం ఉన్న రైతులకు మాఫీ వర్తింపజేశారు. రూ.2లక్షల పైన రుణం ఉన్నవారు అదనపు మొత్తాన్ని చెల్లిస్తే రూ.2 లక్షలను ప్రభుత్వం రైతుల రుణ ఖాతాలకు విడుదల చేయడానికి విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి గురువారం కలిశారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సందర్భంగా కరీంనగర్‌లోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. వీరి వెంట నిశాంత్ రెడ్డి, దినేశ్ కుమార్ తదితరులు ఉన్నారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. @ శంకరపట్నం మండలంలో రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి. @ కరీంనగర్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. @ జగిత్యాలలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. @ గంభీరావుపేట మండలంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు.
Sorry, no posts matched your criteria.