India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సాంబానోవా సిస్టమ్స్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ముందుకు వచ్చినందుకు ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. AI మౌలిక సదుపాయాల సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉన్నారన్నారు. ఈ కంపెనీ భాగస్వామ్యంతో తెలంగాణలో అత్యాధునిక AI టెక్నాలజీని వేగవంతం చేస్తామన్నారు.

సిరిసిల్ల చేనేత కార్మికులకు ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫాం చీరల ఆర్డర్ ఇచ్చి పెద్ద ఎత్తున పని కల్పించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు అందించే ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా అందరికీ ఒకే రంగు గల ఒక్కొకరికి ఒక్కో చీరను అందజేసేందుకు 4.24 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్స్ అందజేసినట్లు పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు నేటి నుంచి ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరిస్తోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా అధికారులకు చేరింది. తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేయడంతో వారికి మరోసారి అవకాశమివ్వాలని గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి అర్హులను అధికారులు ఎంపిక చేయనున్నారు.

నేటి నుంచి నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కొరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్న సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటి సభ్యులు పాల్గొనాలని కోరారు.

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్‌లో ఓ చిన్నారి తల నీళ్ల బిందెలో ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా బిందెలో నుంచి పాప తల బయటికి రాకపోవడంతో బిందెను జాగ్రత్తగా కత్తిరించి పాప తలను జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ ఘటనలో పాపకు ఎలాంటి ప్రమాదం కాలేదు. ఇంత జరుగుతున్నా ఆ చిన్నారి ఏడవకుండా ధైర్యంతో ఉండడానికి చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.90,177 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.37,948 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.44,260, అన్నదానం రూ.7,969,వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేపటినుండి గ్రామసభలు. @ మెట్పల్లి మండలంలో బాలిక అదృశ్యం.. కేసు నమోదు. @ భీమదేవరపల్లి మండలంలో గంజాయి సేవిస్తున్న నలుగురిపై కేసు. @ ముత్తారం మండలంలో ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలలో పోలీసుల తనిఖీలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య. @ గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాటు చేయాలన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు జరిగే ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు

ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వేముల నర్సవ్వ (45) ఇంట్లో కూతురితో గొడవ పడింది. దీంతో మనస్తాపం చెంది ఎదురుగా ఉన్న ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నర్సవ్వ కుమారుడు శేఖర్ ఆదివారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు.

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,49,539 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,31,444 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.95,765, అన్నదానం రూ.22,330,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.