Karimnagar

News August 14, 2024

కరీంనగర్: పతాకావిష్కరణ చేసేది వీరే

image

స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లాలలో పతాకావిష్కరణ చేసే అతిధులను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌లో మంత్రి శ్రీధర్ బాబు, జగిత్యాలలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్, పెద్దపల్లిలో రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ శారద, సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పతాకావిష్కరణ చేయనున్నారు.

News August 14, 2024

వీణవంక: ఢిల్లీ వేడుకలకు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, విద్యార్థులు

image

ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఐదుగురికి ఆహ్వానం అందింది. ఇందులో వీణవంక మండలం ఘన్ముక్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి, 10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్, పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన మహమ్మద్ అల్టీ షాహన్ , మోడల్ స్కూల్ టీచర్ సుజాత, ఓదెల మోడల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థి అభిజ్ఞ కు ఆహ్వానం అందించారు.

News August 14, 2024

సీఎపీఎఫ్ రివ్యూ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్

image

సెంట్రల్ ఆర్మూడ్ పోలీస్ ఫోర్స్‌కు నిర్వహించిన రివ్యూ సమావేశం ఢిల్లీలో కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్‌తో కలిసి రివ్యూ సమావేశంలో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో సెంట్రల్ ఆర్మూడ్ పోలీస్ ఫోర్స్ అద్భుతంగా పనిచేస్తుందని కొనియాడారు. సీఏపీఎఫ్ వారి పనితనం గర్వించదగ్గ విషయమని అన్నారు.

News August 14, 2024

ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

జగిత్యాల జిల్లాలో బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాయిబాబా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వెబ్ సైట్ tgbestudycircle.cgg.gov.inలో ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 10th, ఇంటర్ పాసైన 18 నుంచి 25 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 0878-2268686 నెంబర్ ను సంప్రదించాలన్నారు

News August 13, 2024

ఈసారి అడిషనల్ కలెక్టర్ అకౌంట్ హ్యాక్

image

పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ సోషల్ మీడియా అకౌంట్ హాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని ఆయన ఒక ప్రకటనలో స్వయంగా వెల్లడించారు. తన అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లకు ప్రజలు, అధికారులు, తనకు తెలిసిన వారెవరు స్పందించవద్దని సూచించారు. ఫేక్ మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్యాం ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

News August 13, 2024

జగిత్యాల జిల్లాలో 141 డెంగ్యూ కేసులు నమోదు

image

జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 141 డెంగ్యూ కేసులు నమోదైనట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శ్రీనివాస్ ‘Way2News’ ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించాలి అని సూచించారు.

News August 13, 2024

సింగరేణిలో కలర్ కార్డుల విధానం రద్దు చేసిన యాజమాన్యం

image

సింగరేణిలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే క్రమశిక్షణ చర్యల కింద కార్మికులకు, ఉద్యోగులకు కలర్ కార్డుల విధానాన్ని యాజమాన్యం గత కొన్ని నెలల క్రితం ప్రవేశ పెట్టిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC RG -1 బ్రాంచి కార్యదర్శి పోషం అన్నారు. దీంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని కలర్ కార్డుల విధానం రద్దు చేయాలని AITUC గత నెలలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా యాజమాన్యం నేడు రద్దుచేసినట్లు తెలిపారు.

News August 13, 2024

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం

image

మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్, సత్యనారాయణ, సత్యం తదితరులున్నారు.

News August 13, 2024

‘వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలి’

image

వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సిరిసిల్ల పీఎస్ నగర్లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా చేసి, ఔట్ పేషెంట్ రిజిష్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇన్ పేషెంట్ బెడ్స్, తదితర వాటిని పరిశీలించారు.

News August 13, 2024

పెద్దపల్లి: ప్రమాదాలకు నిలయంగా రాజీవ్ రహదారి

image

రాజీవ్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. వాహనదారుల నుంచి ముక్కు పిండి టోల్ వసూలు చేస్తున్నా ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. రాజీవ్ రహదారిపై బసంత్ నగర్ నుంచి మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్ రోడ్డు వరకు ఇసుక మేటలు వేయడం, సర్వీస్ రోడ్లు అధ్వానంగా మారినా తమకేం సంబంధం లేనట్టుగా రోడ్డు నిర్వహణ సంస్థ (HKR) వ్యవహరిస్తోంది.