Karimnagar

News August 13, 2024

‘వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలి’

image

వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సిరిసిల్ల పీఎస్ నగర్లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా చేసి, ఔట్ పేషెంట్ రిజిష్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇన్ పేషెంట్ బెడ్స్, తదితర వాటిని పరిశీలించారు.

News August 13, 2024

పెద్దపల్లి: ప్రమాదాలకు నిలయంగా రాజీవ్ రహదారి

image

రాజీవ్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. వాహనదారుల నుంచి ముక్కు పిండి టోల్ వసూలు చేస్తున్నా ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. రాజీవ్ రహదారిపై బసంత్ నగర్ నుంచి మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్ రోడ్డు వరకు ఇసుక మేటలు వేయడం, సర్వీస్ రోడ్లు అధ్వానంగా మారినా తమకేం సంబంధం లేనట్టుగా రోడ్డు నిర్వహణ సంస్థ (HKR) వ్యవహరిస్తోంది.

News August 13, 2024

పెద్దపూర్ గురుకులానికి చేరుకున్న డిప్యూటీ సీఎం

image

మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల సంక్షేమ హాస్టల్‌‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం హాస్టల్‌ను పరిశీలించారు. ఆయన వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

News August 13, 2024

కరీంనగర్: ఎలక్ట్రిక్ వాహనాల మార్గాలు ఖరారు!

image

కరీంనగర్ ఆర్టీసీ బస్సు డిపో నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు వెళ్లే మార్గాలను ఖరారు చేసినట్లు డిపో అధికారులు తెలిపారు. మొత్తం 60 బస్సుల్లో జేబీఎస్‌కు 30, గోదావరిఖని 9, మంథని 4, కామారెడ్డి 6, జగిత్యాల 6, రాజన్న సిరిసిల్లకు వెళ్లేందుకు 6 బస్సులు కేటాయించినట్లు పేర్కొన్నారు. కాగా అద్దె ప్రాతిపదికన వీటిని నడపనున్నారు. త్వరలోనే ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయి.

News August 13, 2024

మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

image

రాష్ట్రంలోని అన్ని BC,SC,ST, మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని రవాణా, BC సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు అధికంగా వస్తున్న నేపథ్యంలో గురుకులంలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రతి గురుకుల పాఠశాలలో వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలని ఆదేశించారు.

News August 13, 2024

కరీంనగర్: భారీగా తగ్గిన చికెన్ ధరలు

image

కరీంనగర్‌‌లో శ్రావణ మాసం ప్రభావంతో చికెన్ ధర రోజురోజుకూ తగ్గుతోంది. కొద్ది రోజుల క్రితం కిలో చికెన్ రూ.280 నుంచి రూ.300 వరకు ఉండగా.. శ్రావణ మాసం కావడంతో రూ.110కి పడిపోయింది. కాగా చికెన్ ధరతో పాటు కొనుగోళ్లు కూడా తగ్గాయి. శ్రావణ మాసంలోకి ప్రవేశించడంతో వినియోగం తగ్గిందని, ఇదే పరిస్థితి రానున్న వినాయక చవితి, దేవీ నవరాత్రుల వరకు కొనసాగేలా ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

News August 13, 2024

జగిత్యాల: భర్త డబ్బులు పంపడం లేదని భార్య సూసైడ్

image

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కోరుట్లలోని అంబేడ్కర్ నగర్‌లో పూలవేణి సృజన (27) భర్త గల్ఫ్‌లో ఉంటున్నారు. అయితే తనకు కాకుండా అతడి తల్లికి డబ్బులు పంపిస్తున్నాడని మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News August 13, 2024

నేడు పెద్దాపూర్ గురుకులానికి డిప్యూటీ సీఎం భట్టి

image

మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు గురుకులానికి చేరుకొని అక్కడి సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకోనున్నారు. ఇటీవల గురుకులానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో పాటు నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో డిప్యూటీ సీఎం గురుకులాన్ని సందర్శిస్తున్నారు.

News August 13, 2024

ర్యాగింగ్ చేయడం నేరం: జగిత్యాల ఎస్పీ

image

ర్యాగింగ్ చేయడం నేరమని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ర్యాగింగ్, సైబర్ మోసాల నివారణపై యువతకు, విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని పొలాస అగ్రికల్చర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, అగ్రికల్చర్ కళాశాల డీన్ భారత్ బట్, రూరల్ సీఐ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

News August 13, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రామగుండంలో గుండెపోటుతో టెన్త్ క్లాస్ విద్యార్థిని మృతి. @ వెల్గటూర్ మండలంలో కారు, బైకు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ స్కాలర్షిప్ లు విడుదల చేయాలని సీఎం కు పోస్ట్ కార్డు రాసిన కోరుట్ల డిగ్రీ విద్యార్థులు. @ హైదరాబాదులో విద్యుత్ షాక్ తో కోరుట్ల యువతి మృతి. @ కొదురుపాక జడ్పి పాఠశాలను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ మహదేవ్పూర్ మండలంలో తండ్రి, కొడుకు మృతి.