India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్, ఓదెల మండలాలతో పాటు పలు గ్రామాల ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. గత నెల రోజుల నుంచి మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు జ్వరాలు తగ్గినా.. కీళ్ల నొప్పులతో రోగులు సతమతం అవుతున్నారు. కాగా, రోగులతో పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల ప్రభుత్వ ఆసుపత్రిలోని పడకలు మొత్తం నిండిపోయాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో బెల్టు దుకాణాల్లో మద్యం ఏరులై పారుతోంది. లైసెన్స్‌డ్ దుకాణాల నిర్వాహకులు విక్రయాలను పెంచుకునేందుకే బెల్టు దుకాణాలను పోత్సహిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. 60శాతం మద్యం వీటి ద్వారానే అమ్ముడుపోతోందని పలువురు చెబుతున్నారు. ఒక్కో సీసాపై వ్యాపారులు రూ.10, వీటికి బెల్టు షాపుల్లో అదనంగా రూ.20 వసూలు చేస్తుండటంతో మద్యం ప్రియులపై రూ.30 వరకు అదనపు భారం పడుతోంది.
జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.3,39,377 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,66,512, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,38,000, అన్నదానం రూ.34,865, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
@ ఆర్మీ జవాన్లే దేశంలో నిజమైన హీరోలు అన్న బండి సంజయ్. @ గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి. @ సైదాపూర్ మండలంలో మృతిచెందిన వానరానికి అంత్యక్రియలు. @ ఓదెల మండలంలో శతాధిక వృద్ధురాలు మృతి. @ బుగ్గారం మండలంలో ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య. @ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో బయటపడిన పాములు. @ మెట్పల్లి మండలం జగ్గాసాగర్ లో ఉచిత వైద్య శిబిరం.
ఉరేసుకొని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుగ్గారం మండలం మద్దునూరు గ్రామంలో చోటు చేసుకుంది. బుగ్గారం ఎస్సై శ్రీధర్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్ర అనూష(24) తండ్రి ఎనిమిది నెలల క్రితం మరణించాడు. దీంతో మనస్తాపానికి గురైన అనూష శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల ఆవరణలో ముళ్లపొదలు, శిథిల భవనాలను కూల్చివేయడం, మురికి కుంటను పూడ్చే క్రమంలో పాములు బయటకు వస్తున్నాయి. శనివారం కొన్ని పాములు బయటకు రాగా అందులో నాలుగింటిని చంపేశారు. ఇంకా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని బయటపడే అవకాశం ఉందంటున్నారు. ఇలా పాములు కనిపిస్తుండటంతో విద్యార్థులు పాము కాటుతోనే ప్రమాదానికి గురయ్యారని భావిస్తున్నారు.
ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టులో భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు ఉండగా నిన్న తగ్గు ముఖం పట్టిన ఇన్‌ఫ్లో ప్రస్తుతం ప్రాజెక్టులో 3,583 క్యూసెక్కులకు చేరుకుంది. అవుట్ ఫ్లో 3,583 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 47.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ అవసరాల కోసం ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి తిరుమల శ్రీ స్వామి వారిని రాష్ట్ర టూరిజం సంస్థ మాజీ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఓ యూట్యూబర్ చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్‌కుమార్ కొద్ది రోజులుగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ‘నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి’ అంటూ ఛానల్‌లో పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతేకాదు, అడవిపంది కూర వండటం గురించి వీడియో సైతం ఛానల్‌లో ఉండటం గమనార్హం. దీంతో అతడిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరు గ్రామానికి చెందిన పాంచాల వెంకటేశ్వర్లు-వసంత కుమార్తె మౌనిక మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రతిభ చాటింది. నూతనంగా వెలువడిన TGPSC ఫలితాల్లో పంచాయతీరాజ్ శాఖలో AEE, AE, గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికైంది. పెద్దబొంకూరు ZPHSలో పదో తరగతి వరకు చదువుకున్న మౌనిక NZB ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా, WGL KUలో బీటెక్, జేఎన్టీయూహెచ్‌లో ఎంటెక్ పూర్తిచేసింది.
Sorry, no posts matched your criteria.