Karimnagar

News April 17, 2024

జగిత్యాల: ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి

image

ఈ నెల 6న నిజామాబాద్ నుంచి నర్సంపేటకు వస్తున్న బస్సులో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి(46)ని ఎక్కించారు. అతడి ఆరోగ్యం బాగాలేదని, వరంగల్ వెళ్లాక లేపితే.. అక్కడి నుంచి రైలులో ఆంధ్రా ప్రాంతానికి వెళతారని కండక్టర్ రాజ్‌కుమార్‌కు చెప్పి వారు బస్సు దిగిపోయారు. వరంగల్ చేరుకున్నాక కండక్టర్ లేపడానికి ప్రయత్నించగా..అప్పటికే మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

News April 17, 2024

కరీంనగర్: సివిల్స్ విజేత సాయికిరణ్ నేపథ్యం!

image

రామడుగు మండలం వెలిచాలకు చెందిన సాయికిరణ్ సివిల్స్ ఫలితాల్లో 27వ ర్యాంకు సాధించిన విషయం విదితమే. నిరుపేద కుటుంబానికి చెందిన సాయికిరణ్ బాల్యం నుంచే చదువులో చురుగ్గా రాణిస్తున్నారు. వరంగల్ NITలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ పరీక్షలకు హాజరై ఉత్తమ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి కాంతయ్య బాంబే, భీవండిలో పవర్ లూమ్ కార్మికుడిగా పని చేసి మృతిచెందారు. తల్లి ఇప్పటికీ గ్రామంలో బీడీలు చూడుతున్నారు. 

News April 17, 2024

జయంతికి కొండగట్టులో సకల సౌకర్యాలు కల్పించాలి: అదనపు కలెక్టర్

image

కొండగట్టు అంజన్న ఆలయంలో ఈ నెల 22 నుంచి జరిగే చిన్న జయంతి ఉత్సవాల్లో  భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. మంగళవారం కొండగట్టులో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలలో అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కల్గనివ్వొద్దన్నారు. ఆర్డీఓ మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్‌తో పాటు ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

News April 16, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సివిల్స్ లో సత్తా చాటిన కరీంనగర్ జిల్లా యువతి, యువకుడు. @ వేములవాడ రాజన్న చెరువు అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్న కలెక్టర్. @ జగిత్యాల మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. @ మల్లాపూర్ మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ మల్లాపూర్ మండలంలో 98 వేల నగదు పట్టివేత. @ గోదావరిఖనిలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్ట్.@ కొండగట్టులో ఈత తాటి చెట్లు దగ్ధం

News April 16, 2024

జగిత్యాల: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి మృతి

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఉరేసుకొని మామిడి నర్సయ్య(34) మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. నర్సయ్య కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యారని చెప్పారు. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఉరేసుకొని మృతి చెందినట్లు పేర్కొన్నారు. నర్సయ్య భార్య వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News April 16, 2024

సివిల్స్‌ ఫలితాల్లో కరీంనగర్ యువతి ప్రతిభ

image

సివిల్స్ ఫలితాల్లో కరీంనగర్ యువతి ప్రతిభ కనబరిచారు. పట్టణానికి చెందిన కొలనుపాక సహన 739వ ర్యాంకు సాధించి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. కరీంనగర్‌ టౌన్‌లో ఇంటర్ వరకు చదివిన సహన.. హైదరాబాద్ జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలోని ఓ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకుని తాజా ఫలితాల్లో ర్యాంకు సాధించారు. సహన తండ్రి అనిల్ కరీంనగర్ టౌన్‌లో ఓ పత్రిక రిపోర్టర్‌గా పని చేస్తున్నారు.

News April 16, 2024

సివిల్స్‌లో సత్తాచాటిన కరీంనగర్ కుర్రాడు

image

నేడు ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన నందల  సాయి కిరణ్ సత్తాచాటారు. చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధించారు. ఈయన ఐఏఎస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయన్ను అభినందించారు.

News April 16, 2024

KNR: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

image

వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన ముత్తారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికలు తెలిపిన వివరాలు.. ఓడేడుకు చెందిన మొగిలి రమేష్ (45) ప్రతి రోజు లాగానే తన పంట పొలం వద్దకు మోటారు వేయడానికి ఉదయం వెళ్లి మధ్యాహ్నం వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా మానేరులో కింద పడి ఉండటం చూసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

News April 16, 2024

KNR: గుండెపోటుతో స్వర్ణకారుడు మృతి

image

గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సుంకోజు నరేష్ (29) అనే స్వర్ణకారుడు మంగళవారం ఉదయం ఛాతిలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడిని చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.

News April 16, 2024

KNR: పోలీస్ స్టేషన్ ఘటనపై పోలీస్ శాఖ చర్యలు.!

image

<<13057630>>మహాదేవపూర్ <<>>PSలో సోమవారం జరిగిన ఘటనపై పోలీస్ శాఖ తీవ్రచర్యలు చేపట్టింది. ఆ ఘటనపై మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఆదేశాల మేరకు జిల్లా SP కిరణ్ ఖరే.. SI ప్రసాద్‌ను VRకు బదిలీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. అదేవిధంగా స్టేషన్ పరిధిలోని ఓ హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఆరుగురి సిబ్బందిపై బదిలి వేటు వేశారు. దీంతో పోలీసు అధికారులు, సిబ్బందిలో అలజడి మొదలైంది.