India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సరికొత్త ఆలోచన చేశారు. గృహిణి ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు, కుటుంబం బాగుంటుందన్న నినాదాన్ని బలంగా గ్రామాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీనికోసం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి శుక్రవారం గ్రామసభ నిర్వహిస్తున్నారు. ఈ సభ క్షేత్రస్థాయిలో గృహిణులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తోంది. ప్రతివారం ఏదో ఒక అంగన్వాడీలో కలెక్టర్ ఈ సభకు హాజరవుతున్నారు.
నేత కార్మికుల కష్టంతో వెలువడే ఉత్పత్తులను ప్రచారం చేయడానికి మనకన్నా పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు ఉండరు కాబట్టి చేనేత వస్త్రాల ప్రచారానికి చేనేత కార్మికులే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించింది. కరీంనగర్ జిల్లాలో 651, జగిత్యాల 781, పెద్దపల్లి 547, రాజన్న సిరిసిల్ల 486 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇది వరకు ప్రభుత్వ పాఠశాలల్లో అతిపెద్ద సమస్యగా విద్యుత్ బిల్లులు ఉండేవని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అనడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల ఎద్దుగుట్ట అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత మేకల మందపై చిరుత దాడి చేసింది. చిరుత ఒక్కసారిగా మేకల మందపై విరుచుకుపడటంతో పరుగులు తీశాయి. మేకల కాపరి శ్రీనివాస్ కొద్దిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. తన చేతిలో ఉన్న గొడ్డలితో కాపరి బెదిరించే ప్రయత్నం చేయడంతో చిరుత అతడి వైపు వెళ్లలేదు. చిరుత అక్కడి నుంచి వెళ్లే క్రమంలో ఓ మేకను ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గోదావరిఖని చౌరస్తా సమీప ప్రాంతంలో ఉంటున్న సీనియర్ జర్నలిస్టు నాయిని మధునయ్య(67) తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన గతంలో సింగరేణిలో విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. మధునయ్య మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తల్లి పాలు అమృతం లాంటివని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి తల్లి పిల్లలకు జన్మనిచ్చిన 24 గంటల లోపు కచ్చితంగా ముర్రు పాలను పట్టించాలన్నారు. దాని వల్ల తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి. @ మెట్పల్లి లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్. @ గంగాధర మండలంలో లారీ, బస్సు ఢీ.. లారీ డ్రైవర్ మృతి. @ చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి సస్పెండ్. @ హుస్నాబాద్‌లో గద్దర్ వర్ధంతిలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ ఓదెల మండలంలో వ్యక్తి ఆత్మహత్య.
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జి అధికారి ఆర్.వి.కర్ణన్ సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రతి గ్రామం, పట్టణాల్లోని వార్డుల్లో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం తాగునీటి సరఫరా, డ్రై డే, ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించాలన్నారు.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయం నుంచి 27 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు. అందులో ఇద్దరు AEOలు, ఇద్దరు పర్యవేక్షకులు, 8 మంది సీనియర్ అసిస్టెంట్లు, 10 మంది జూనియర్ అసిస్టెంట్లు, DEతో కలిసి 27 మంది ఆలయ ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని యాదగిరిగుట్ట, కొండగట్టు, కొమురవెల్లి, భద్రాచలం ఆలయాలకు బదిలీ చేశారు. కాగా, ఈ ఉద్యోగులు 17 ఏళ్ల తర్వాత బదిలీ అయినట్లు సమాచారం.
కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో హైర్ బస్సుల డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం డ్యూటీలో జాయిన్ అయిన ఓ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయడం పట్ల హైర్ బస్సు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు డ్రైవర్ తాను మద్యం సేవించనని, అలవాటు లేదని చెప్తున్నా వినలేదని ఆరోపించారు. హైర్ బస్సుల డ్రైవర్ల ఆందోళనతో సమీప గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
Sorry, no posts matched your criteria.