Karimnagar

News April 12, 2024

విభజన హామీలు విస్మరించిన కేంద్ర ప్రభుత్వం: మంత్రి పొన్నం

image

బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా.. తెలంగాణ విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 14న కరీంనగర్లో దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని, ఓటు అడిగే నైతికహక్కు బీజేపీకీ లేదని అన్నారు. అధికారంలోకి వచ్చి ప్రభుత్వ సంస్థలను అమ్ముకున్నారే తప్పా.. ప్రజలకు ఏమి చేయలేదన్నారు.

News April 12, 2024

KNR: ఓటర్లను తిప్పుకుంటున్నారు!

image

ఎంపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో వివిధ పార్టీలు తమవ్యూహాలకు పదునుపెట్టాయి. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ (కొంతమేర) పార్లమెంటు స్థానాలున్నాయి. కరీంనగర్‌లో కాంగ్రెస్ మినహా అన్నిస్థానాల్లో అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. గ్రామాలు, మండలాల వారీగా సర్వేలు చేయించుకుంటున్నారు. వివిధ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారిని దగ్గర చేసుకుంటున్నారు.

News April 12, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రూ.36.56 కోట్ల లబ్ధి

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు గత ఆర్థిక సంవత్సరంలో రుణాలు తీసుకొని వడ్డీతో సహా చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ మాఫీని వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో జిల్లాలోని మొత్తం 33,471 స్వయం సహాయక సంఘాలకు రూ.36.56 కోట్ల లబ్ధి చేకూరింది. KNR రూ.11.34 కోట్లు, JGTL రూ.10.17 కోట్లు, SRCL రూ.8.23 కోట్లు, PDPL రూ.6.82 కోట్లు వడ్డీ జమ చేశారు.

News April 12, 2024

కరీంనగర్: 19న బండి సంజయ్ నామినేషన్

image

కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న కరీంనగర్‌లో నామినేషన్ వేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ లో బీజేపీ గెలుస్తుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

News April 12, 2024

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

image

వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో రాజన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్‌లో బారులుదీరారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు రాజన్నను దర్శించుకొని తరించారు.

News April 12, 2024

హుజూరాబాద్: పెరిగిన బస్సు ఛార్జీలు!

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని నయీంనగర్ పెద్ద మోరీ వద్ద బ్రిడ్జి నిర్మిస్తున్న సందర్భంగా బస్సులు ములుగు రోడ్డు నుంచి తిరిగి వెళుతున్నాయి. దీంతో బస్సు ఛార్జీలు నేటి నుంచి ఆర్టీసీ అధికారులు పెంచారు. హుజూరాబాద్ నుంచి హనుమకొండకు రూ.50 ఉంటే రూ.10 పెంచి రూ.60 చేశారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రయాణికులపై భారం మోపడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. పెంచిన ఛార్జీలు తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News April 12, 2024

కరీంనగర్‌లో కొనసాగుతున్న ఉత్కంఠ!

image

కరీంనగర్‌‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మినహా ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఖరారవడంతో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. మరో 6 రోజుల్లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో అభ్యర్థులు జనం మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. దీంతో కరీంనగర్‌లో ఉత్కంఠ నెలకొంది.

News April 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు ప్రైవేటు ఆసుపత్రుల ప్రసూతి గదుల సీజ్.
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి.
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు.
*మహదేవ్పూర్ మండలంలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై దాడులు.
*మెట్ పల్లి పట్టణంలో చాయ్ పై చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్.
*తన జీవితం తెరిచిన పుస్తకమన్న మాజీ మంత్రి కొప్పుల 

News April 11, 2024

బండి సంజయ్ రూ.12వేల కోట్ల నిధులు తీసుకువచ్చారు: రాణి రుద్రమ

image

భారతదేశంలో అందరు ఎంపీల కంటే ప్రజా సమస్యలపై పోరాటం చేసిన బండి సంజయ్ పై అత్యధిక కేసులు ఉన్నాయని బీజేపీ నాయకురాలు రాణి రుద్రమదేవి అన్నారు. గురువారం కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పాదయాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకున్న వ్యక్తి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి రూ.12 వేల కోట్ల నిధులు ఎంపీ బండి సంజయ్ తీసుకువచ్చారని తెలిపారు.

News April 11, 2024

‘నా జీవితం తెరిచిన పుస్తకం’: మాజీ మంత్రి కొప్పుల

image

నా జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం ఆయన ధర్మపురి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలకు దీటుగా స్పందించారు. నా ఆస్తులు లెక్కపెట్టడానికి గెలిచినవా? లేక ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గెలిచినవా? అని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.