Karimnagar

News April 11, 2024

కరీంనగర్: ఇంకా ఐదు రోజులే!

image

పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఓటు హక్కు నమోదు అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇందుకోసం పెద్దపల్లి జిల్లాలో 18 సంవత్సరాలు నిండినవారిపై బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఆరా తీస్తున్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 15 లోపు నూతన ఓటు నమోదు, సవరణల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు. 25న తుది జాబితా విడుదల చేయనున్నారు.

News April 11, 2024

KNR: 16 నుంచి మూడో సెమిస్టర్ పరీక్షలు

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఎస్సీ (హానర్స్) డిజైన్, టెక్నాలజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయని విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్వి శ్రీరంగ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు గమనించాలని ఆయన తెలిపారు.

News April 11, 2024

నన్ను చంపేందుకు కుట్ర: పుట్ట మధు

image

తనను చంపేందుకు కాంగ్రెస్‌ నాయకులు కుట్రలు చేస్తున్నారని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు అన్నారు. పదవీకాలం ముగిసిన వెంటనే గన్‌మెన్లను తొలగించి హతమార్చేందుకు పథకం రూపొందించారని సంచలన ఆరోపణలు చేశారు. మంథని ప్రజల ఆశీర్వాదంతో బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా, జడ్పీ ఛైర్మన్‌గా ఎదిగిన తనపై కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేసి ప్రజల నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

News April 11, 2024

కరీంనగర్: నిబంధనలు పాటించని ఉపాధ్యాయుడి సస్పెండ్

image

కరీంనగర్‌లో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రంలో నిబంధనలు పాటించని కరీంనగర్ సవరన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు పండిట్ ఆర్. చంద్రశేఖర్ రావును సస్పెండ్ చేశారు. మూల్యాంకన విధుల్లో చరవాణి మాట్లాడుతున్నందుకు ఆయన్ని వెంటనే సస్పెండ్ చేస్తూ క్యాంపు ఆఫీసర్, డిఇఓ జనార్దన్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

News April 11, 2024

జగిత్యాల: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటకు చెందిన వకుళాభరణం మణిదీప్ (31) ప్రేమ విఫలమై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మణిదీప్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరికి మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుని తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News April 11, 2024

రేపు బాస్కెట్ బాల్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు

image

కరీంనగర్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో ఈనెల 12న జిల్లా బాలబాలికల జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి ఆనంతరెడ్డి తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారుల వయసు ధ్రువీకరణపత్రం, ఆధార్, రెండు పాస్పోర్ట్ ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. ప్రతిభ చాటిన వారిని ఈనెల 21నుంచి 23వరకు జరిగే 8వ జూనియర్స్ అంతర్ జిల్లా టోర్నమెంట్‌కి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

News April 11, 2024

కరీంనగర్: ఉద్యోగులూ.. జర జాగ్రత్త!

image

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఎన్నికల సందర్భంగా జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం నిబంధనలు తెలియజేస్తున్నాయి. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఇటీవల సిద్దిపేట జిల్లాలో 106 మంది ఈజీఎస్, ఐకెపీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. కావున జిల్లాలోని ఉద్యోగులు పార్టీలపై పక్షపాతం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

News April 10, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

* చీఫ్ సెక్రటరీ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు. * పెగడపల్లి మండలంలో 400 గ్రాముల గంజాయి పట్టివేత. * మల్యాల మండలంలో ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య. * కొండగట్టులో భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జగిత్యాల ఎస్పీ. * వేములవాడ రూరల్ మండలంలో ఎండ వేడి తాళలేక చేపల మృతి. * కొండగట్టు అంజన్న దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. * యూట్యూబ్ స్టార్ గంగవ్వకు సన్మానం.

News April 10, 2024

మల్లాపూర్: హత్యకు పాల్పడిన యువకుడి అరెస్ట్

image

మల్లాపూర్ మండల కేంద్రంలో ఈ నెల 5న అంబదాస్ అనే వ్యక్తిని హత్య చేసిన కందెల రవితేజ (21) అనే యువకుడిని బుధవారం అరెస్టు చేసినట్లు డిఎస్పి ఉమామహేశ్వరరావు తెలిపారు. తన తల్లితో మృతుడు సహజీవనం చేయడం ఇష్టం లేకపోవడంతో పాటు తన తల్లి సంపాదించే డబ్బులు వాడుకుంటున్నాడని, తన జల్సాలకు అడ్డు వస్తున్నాడనే నెపంతో రవితేజ హత్యకు పాల్పడ్డాడని వివరించారు. సమావేశంలో సిఐ నవీన్, ఎస్ఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

News April 10, 2024

మెదక్: మరో 6 రోజులే గడువు

image

ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.