India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దోస్తానా అంటే కరీంనగర్ వాసులు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం (ఆగస్టు 5వ తేదీన ) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తిరిగి ప్రతి సోమవారం యథావిధిగా ప్రజావాణి ఉంటుందని కలెక్టర్ వివరించారు.
@ ఏసీబీకి పట్టుబడిన కాల్వ శ్రీరాంపూర్ తాసిల్దార్. @ ఈనెల 5న జరగనున్న జగిత్యాల, కరీంనగర్ ప్రజావాణి కార్యక్రమం రద్దు. @ మెట్పల్లి పట్టణంలో నకిలీ నోట్ల ముఠా సభ్యుల అరెస్ట్. @ మేడిపల్లి మండలంలో వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ధర్నా. @ గంభీరావుపేట మండలంలో చిరుత పులి కలకలం. @ సిరిసిల్లలో ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ.
ఆర్వోఆర్ చట్టం, పెండింగ్ భూసమస్యల అంశాలపై సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్‌లతో సమీక్షించారు. ఇప్పటి వరకు పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జిల్లాల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసిన తర్వాత సంబంధిత దరఖాస్తుల ఆన్‌లైన్‌లో అప్డేట్ చేసి పరిష్కరించాలన్నారు.
బోయినపల్లి మండలం మన్వాడ వద్ద గల మిడ్ మానేరు ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్ హౌస్ ద్వారా 12,600 క్యూ సెక్కులు, మానేరు, ములవాగు ద్వారా 1890 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు . దీంతో జలాశయానికి మొత్తం 14,490 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318 మీటర్లకు ప్రస్తుతం 311.080 ఉంది.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల తహశీల్దార్ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు.. మందమర్రికి చెందిన రైతు కాడం తిరుపతి నుంచి రూ.10,000 లంచం తీసుకుంటుండగా తహశీల్దార్ జహేద్ పాషాతో పాటు అతడి బినామీ వీఆర్ఏ విష్ణు, డ్రైవర్ అంజద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రైతు వద్ద మ్యూటేషన్ కోసం లంచం తీసుకుంటున్నట్లు సమాచారం.
మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయని అర్చకులు తెలిపారు. శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలకు ఇప్పటికే చాలా మంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది వివాహాలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.
సిరిసిల్ల జిల్లాలో వీధి కుక్కలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. వీధుల్లో గుంపులుగా తిరుగుతుండటంతో వాటిని చూసి ప్రజలు జంకుతున్నారు. వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది కుక్కలు, కోతుల దాడిలో గాయపడిన వారు 1,543 మంది ఉన్నారు. 3 రోజుల క్రితం ముస్తాబాద్ మండలం సేవాలాల్‌తండాలో అర్ధరాత్రి ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని కుక్కలు పీక్కుతిన్న విషయం విదితమే.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన చాడ సాయి కృష్ణ ఏఐఏపీజీఈటీ (ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష)లో 15వ ర్యాంకు సాధించాడు. రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించాడు. సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో హోమియోపతి విద్యను అభ్యసించారు. సాయి కృష్ణకు ఆల్ ఇండియాలో 15వ రావడంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లాలో విషాదం జరిగింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన శనిగరపు శ్రీలత(35) విష జ్వరంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. శ్రీలతకు 5 రోజుల క్రితం జ్వరం రాగా.. జమ్మికుంటలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. శ్రీలతకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.