India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిరిసిల్ల జిల్లా బోయినపల్లి, మండలం మన్వాడ వద్ద గల మధ్యమానేరులో నీటి నిల్వ 10.55 టీఎంసీలకు చేరిందని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఎల్లంపల్లి జలాలు 14,814 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందన్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 318 మీటర్లు కాగా.. ప్రస్తుతం 309.45 మీటర్లు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 27.50 టీఎంసీలకుగాను 10:15 టీఎంసీలమేరకు నీరు ఉందని అధికారులు తెలిపారు.
ఇన్నాళ్లు నీరు లేక వేలవేల బోయిన చెరువుల్లో జలకళ సంతరించుకుంటుంది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండుకుంటున్నాయి. కరీంనగర్ మండలంలో దాదాపు పెద్ద చెరువులు 33 ఉండగా.. చిన్న చెరువులు, కుంటలు 40 వరకు ఉంటాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులోకి నీరు చేరి జలకళ సంతరించుకుంటుంది. ఇన్నాళ్లు వెలవెలబోయిన చెరువులు నీరు చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఈవోగా రామకృష్ణారావును నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టు ఆలయ ఈవోగా అదనపు బాధ్యత నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌ను మెదక్ అసిస్టెంట్ కమిషనర్‌గా బదలీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై తనవంతు కృషి చేస్తానని, సదుపాయాలు మెరుగు పరుస్తానని రామకృష్ణారావు తెలిపారు.
@ చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన BRS నాయకులు.
@ వేములవాడ మండలంలో అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
@ ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్న జగిత్యాల కలెక్టర్.
@ జగిత్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.
@ దుబాయ్‌లో సిరిసిల్ల జిల్లా వాసి అనారోగ్యంతో మృతి.
ఆగస్టు 5 నుంచి 9 వరకు నిర్వహించే స్వచ్చధనం-పచ్చదనం కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.58,236 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.30,226, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.20,300, అన్నదానం రూ.7,710 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం.. వేములవాడ మండలం నూకలమర్రికి చెందిన చంద్రకాంత్ అనే గల్ఫ్ కార్మికుడు అనారోగ్యంతో అబుదాబిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గతనెల 29న మృతి చెందాడు. అయితే 1992 నుంచి దుబాయ్ వెళ్తున్న చంద్రకాంత్.. మరణం చెందటం పట్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈనెల 2న మృతదేహం స్వగ్రామానికి చేరనున్నట్లు సమాచారం.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కాంప్లెక్స్ హైస్కూల్ హెచ్ఎంలతో కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కూల్లో జరుగుతున్న విషయాలపై ఆరా తీశారు. వెనుకబడిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిల్లలకు ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో చదవడం, రాయడంపై ప్రత్యేక తరగతులు తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలలో బేసిక్ టెస్టులు నిర్వహించాలన్నారు.
పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో రావాల్సిన అద్దెలను, ఆస్తి పన్నులను వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి మున్సిపాలిటీలపై అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆదాయం పెంపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టాలని చెప్పారు.
సిరిసిల్ల జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ముస్తాబాద్ మండలం బట్టోనితాళ్లలో బుధవారం రాత్రి వృద్ధురాలు పిట్ల రాజ్యలక్ష్మి (80) ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లోకి చొరబడ్డ వీధి కుక్కలు వృద్ధురాలిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం రోజురోజుకూ ఎక్కువ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Sorry, no posts matched your criteria.