India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిరిసిల్ల జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండాకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ బానోత్ రాజుకు మూడున్నర ఎకరాల పోడు భూమి ఉండగా.. బుధవారం ఫారెస్ట్ అధికారులతో గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ జిల్లాలో డెంగీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. కరీంనగర్ మండలంలో బుధవారం మరో 2 డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో నెల రోజుల వ్యవధిలోనే డెంగీ కేసులు 26కు చేరుకున్నాయి. ఇవి అధికారిక లెక్కలే కాగా.. అనధికారికంగా ఎన్ని కేసులు ఉన్నాయోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. డెంగీతో పాటు జిల్లాలో టైఫాయిడ్, వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
@ డెంగ్యూ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న జగిత్యాల కలెక్టర్.
@ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న సిరిసిల్ల కలెక్టర్.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో కారు, బైకు ఢీ.. ఒకరికి గాయాలు.
@ వీణవంక మండలంలో బైక్ అదుపు తప్పి యువకుడికి గాయాలు.
@ కోనరావుపేట మండలంలో బావిలో పడిన కుక్కను రక్షించిన పోలీసులు.
@ ఇబ్రహీంపట్నం మండలంలో మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్.
కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా స్థాయి అధికారులు, సీడీపీవోలు, మెడికల్ ఆఫీసర్లతో తల్లిపాల వారోత్సవాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయన్నారు. ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై గ్రామ గ్రామాన మహిళలకు అవగాహన కల్పించాలన్నారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.64,587 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.34,538, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.20,725, అన్నదానం రూ.9,324 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
జిల్లాలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెండింగ్ ధరణి దరఖాస్తులపై జిల్లాలోని తహసీల్దార్లతో బుధవారం రివ్యూ నిర్వహించారు. ప్రతి మండలంలో పెండింగ్ ఉన్న సమస్యలు వాటికి గల కారణాలు, పరిష్కరించేందుకు సిద్ధం చేసుకున్న ప్రణాళిక వివరాలను కలెక్టర్ తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు.
మైనర్‌పై అత్యాచారం చేసిన నిందితునికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వివరాల ప్రకారం.. పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంగలాయిపేట గ్రామానికి చెందిన కొలిపాక అంజయ్య అదే గ్రామానికి చెందిన ఓ బాలికను అత్యాచారం చేశాడు. కేసు నిరూపణ కావడంతో 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.3 లక్షలు ఇవ్వాలని న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చారు.
వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందిన రైతన్నలు ఇప్పుడిప్పుడే వానాకాలం సాగుపై ఆశలు పెంచుకున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరగా నాట్లు వేయడం ముమ్మరం చేశారు. ఈ వానాకాలం జిల్లాలో 2.75 లక్షల ఎకరాలలో వరిసాగు జరుగుతుందని అంచనా వేసిన జిల్లా వ్యవసాయశాఖ అందుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు మందులను అందుబాటులో ఉంచేలా కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తోంది.
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఆగస్టు 9 నుంచి పీజీ (ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఏ) 2వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. విద్యార్థులు పరీక్షల టైం టేబుల్ కోసం విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.satavahana.ac.inను సందర్శించాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. కాగా ఇప్పటి వరకు 6.35 కోట్ల మంది మహిళలు ప్రయాణించగా.. రూ.230.72 కోట్ల ఆదాయం వచ్చినట్లు కరీంనగర్ ఆర్ఎం సుచరిత తెలిపారు. ఆక్యుపెన్సీ రేషియో సైతం 85.33కు పెరిగినట్లు చెప్పారు. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.