India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. కొద్దిరోజుల పాటు కురిసిన వర్షాలకు ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సాధారణ జ్వరాలతో పాటు వైరల్ జ్వరాలు సైతం ప్రబలుతున్నాయి. జనవరి నుంచి జులై వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 190 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ కేసులు కరీంనగర్, జగిత్యాలలోనే ఉన్నాయి.
కరీంనగర్‌లోని ఎల్ఎండీ డ్యాం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేస్తుండగా పోలీసులు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. అశోక్ నగర్‌కు చెందిన మాడూరి రవీందర్ సోమవారం అర్ధరాత్రి ఎల్ఎండీ డ్యాం వద్ద ఆత్మహత్యాయత్నం చేస్తున్న క్రమంలో గస్తీలో ఉన్న లేక్ అవుట్ పోస్టు పోలీసులు గమనించారు. వెంటనే అక్కడి చేరుకుని అతడిని కాపాడారు. పోలీసులు రవీందర్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.
@ ముత్తారం మండలంలో తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య.
@ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో జ్వరంతో బాలుడి మృతి.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.
@ ఆశ వర్కర్ల వేతనాలు పెంచాలన్న కోరుట్ల ఎమ్మెల్యే.
@ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా.
@ బోయిన్పల్లి మండలంలో బైక్ ఢీకొని అంగన్వాడి ఆయాకు గాయాలు.
@ జగిత్యాల కలెక్టరేట్లో రెండో విడత రైతు రుణమాఫీ వేడుక
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.71,003 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.43,412, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.18,650, అన్నదానం రూ.8,941,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభలో రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో రూ.1 లక్ష 50 వేల వరకు 9211 మంది రైతులు రుణమాఫీ పొందారని పేర్కొన్నారు. రుణమాఫీ కింద హుస్నాబాద్ నియోజకవర్గానికి 93 కోట్ల 89 లక్షల ఆర్థిక సాయం అందిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ రెండో విడత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 21,785 మంది రైతులకు రూ.207.82 కోట్లు, జగిత్యాల జిల్లాలో 17,903 మంది రైతులకు రూ.169.11 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో 13,401 రైతులకు రూ.124.41 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో 12,202 మంది రైతులకు రూ.117.77 కోట్ల రుణమాఫీ వర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి KNR వ్యాప్తంగా దేవాదాయ శాఖలో బదిలీల ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని అర్చకులతో పాటు.. జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సిబ్బంది బదిలీలు, పదోన్నతులపై ఆశలు పెట్టుకున్నారు. కొందరికి పదవీ విరమణ వయసు దగ్గర పడటంతో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి KNR అర్చక, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. దేవాలయాల్లో మార్పు తీసుకురావడం కోసం ప్రభుత్వం బదిలీలకు శ్రీకారం చుట్టిందన్నారు.
ఉమ్మడి KNR జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. 18 ఏళ్లలోపు విద్యార్థులు బైకులు, కార్లు నడపుతుండటంతోనే ప్రమాదాలవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు 70కి పైగా మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. 2022లో 32, 2023లో 231, 2024లో 78.. గత మూడేళ్లలో మొత్తం 341 కేసులు నమోదయ్యాయని, మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని KNR టౌన్ ACP జి.నరేందర్ తెలిపారు.
తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రాజిరెడ్డి పద్మ దంపతుల కొడుకు రమేశ్(30) MBA పూర్తి చేసి మూడేళ్లుగా ఇంటి వద్ద ఉంటున్నాడు. పొలం పనుల్లో తమకు సహాయం చేయకుండా రోజు ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్నాడని రాజిరెడ్డి మందలించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.
CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలపై అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం ఉమ్మడి KNR జిల్లాకు వచ్చే నెల 2న వార్డుల మ్యాపింగ్, ఓటరు జాబితా తయారీపై కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జగిత్యాలలో 380, పెద్దపల్లి 265, KNR 313, సిరిసిల్ల 255.. ఉమ్మడి జిల్లాలోని 1,213 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, ప్రతి జిల్లా నుంచి 5 ఆపరేటర్లు శిక్షణలో పాల్గొననున్నారు.
Sorry, no posts matched your criteria.