Karimnagar

News July 30, 2024

PDPL: తీవ్ర జ్వరంతో బాలుడు మృతి

image

విష జ్వరంతో బాలుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ ఖాన్ పేటలో జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లేశ్-పద్మ దంపతులకు సాత్విక్(13) కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే బాలుడు కొద్ది రోజులగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం KNR వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

News July 30, 2024

కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు: MLAలు

image

కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించారని రామగుండం MLA రాజ్ ఠాకూర్, పెద్దపల్లి MLA చింతకుంట విజయ రమణారావు ఆరోపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి హరీష్ రావులు కాళేశ్వరంపై చేస్తున్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పెద్దపల్లి జిల్లాలో ఒక్క ఎకరాకు నీరు రాలేదని ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు.

News July 30, 2024

KNR: స్థానిక ఎన్నికలు.. ఓటరు జాబితాకు కసరత్తు

image

KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేయనుంది. అందుకోసం ప్రతి జిల్లా నుంచి ఐదుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఓటర్ల జాబితా తయారీ కోసం ఎంపిక చేసి ఓటర్ల జాబితా తయారీపై హైదరాబాద్‌లో వారికి ఒక రోజు శిక్షణ ఇవ్వనుంది.

News July 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ పెద్దాపూర్ గురుకులం ఎదుట ఏబీవీపీ ధర్నా
@ ఓదెల మండల కేంద్రంలో నాగదేవత విగ్రహంపై నాగుపాము
@ కమాన్పూర్ మండలంలో కోడిపందాలు ఆడుతున్న ఏడుగురిపై కేసు
@ సిరిసిల్లలో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
@ ఎలిగేడు మండలంలో యువకుడి ఆత్మహత్య
@ ధర్మారం మండలంలో గుండెపోటుతో మహిళ మృతి
@ హుజూరాబాద్ మండలంలో తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

News July 29, 2024

ఇచ్చిన మాట నెరవేర్చేది కాంగ్రెస్ సర్కారే: వెలిచాల

image

ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ సర్కారు మాటమీద నిలబడుతుందని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ సర్కారు నెరవేరుస్తుందని తెలిపారు. మంగళవారం లక్షన్నరలోపు రైతుల రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయన్నారు.

News July 29, 2024

KNR: కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మయ్య

image

కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మొగిలిపాలెం మాజీ సర్పంచ్, సీనియర్ న్యాయవాది కల్లేపల్లి లక్ష్మయ్య నియామకయ్యారు . ఈమేరకు TPCC లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు జారీచేశారు. వైస్ ఛైర్మన్లుగా వడ్లూరి కృష్ణ , ప్రదీప్ కుమార్ రాజు, కన్వీనర్లుగా శంకర్, శ్రీకాంత్, నవాజ్‌ను నియమించారు. తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం, MLA కవ్వంపల్లికి కృతజ్ఞతలు చెప్పారు.

News July 29, 2024

కరీంనగర్: మొదలైన ఎన్నికల సందడి !

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీ కాలం పూర్తయి 6 నెలలు అవుతోంది. అంతేకాకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవీ కాలం ఈనెల 4తో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి జిల్లాలోని 1,218 పంచాయతీలతో పాటు 64 మండలాల్లో ఎన్నికల టాపిక్ నడుస్తోంది.

News July 29, 2024

కరీంనగర్: ‘ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అధ్యయన కేంద్రంలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు tsscstudycircle.in లో చూడాలన్నారు.

News July 29, 2024

పెద్దపల్లి: తల్లిదండ్రులు మృతి.. అనాథలైన చిన్నారులు

image

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లెకు చెందిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. గ్రామానికి చెందిన ఐలయ్య- భాగ్యమ్మ దంపతులకు కుమారుడు అభిలాష్, కుమార్తె మనీషా ఉన్నారు. తండ్రి క్యాన్సర్‌తో ఆరు నెలల క్రితం మృతి చెందగా.. తల్లి 5 రోజుల క్రితం చనిపోయారు. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News July 29, 2024

నంది రిజర్వాయర్‌కు 15,750 క్యూసెక్కుల నీరు విడుదల

image

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌజ్ ద్వారా కొనసాగుతోంది. గోదావరి జలాల ఎత్తిపోతల ప్రక్రియ నిన్నటి వరకు నాలుగు పంపుల సామర్థ్యంతో 12,600 క్యూసెక్కుల నీటి తరలిస్తున్నారు. నేడు మరో పంపు ద్వారా మొత్తం 15,750 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో 18,655 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 16,081 క్యూసెక్కుల ప్రవాహం ఉంది.