Karimnagar

News July 29, 2024

కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన దొంతినేని అభినయ్(26) కరీంనగర్ కాపువాడలో ఉంటూ ఓ షోరూంలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. కరీంనగర్ నుంచి పెద్దపల్లి బైపాస్ మార్గంలో బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 29, 2024

ఉమ్మడి కరీంనగర్‌లో 4 కొత్త జాతీయ రహదారులకు ప్రతిపాదన!

image

ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల(NH)పై ఆశలు నెలకొంటున్నాయి. ఇటీవల 4 కొత్త NHలు కావాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. జగిత్యాల-పెద్దపల్లి-మంథని-కాటారం వరకు 130 KM రాష్ట్ర రహదారిని NHగా మార్చాలని ప్రతిపాదించారు. ఈ రహదారి నిర్మాణంతో NH 565, 563, 353 అనుసంధానించడమే కాకుండా TG, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌ ప్రజలకు అనువుగా ఉంటుందని, కాళేశ్వరం క్షేత్రానికి ప్రాధాన్యం లభిస్తుందని భావిస్తున్నారు.

News July 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ గురుకుల విద్యార్థులను పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే. @ కమలాపూర్ మండలంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి. @ బీర్పూర్ మండలంలో తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు. @ కథలాపూర్ మండలంలో బావిలో తేలిన యువకుడి మృతదేహం. @ రాయికల్ మండలంలో మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య. @ వేములవాడలో ఘనంగా బద్దిపోచమ్మకు బోనాల సమర్పణ.

News July 28, 2024

KNR: భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి

image

హైదరాబాద్‌లోని బోనాల పండుగ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌కు బండి సంజయ్ కౌంటరిచ్చారు. అక్బర్ కాంగ్రెస్‌లో చేరితే కొడంగల్ నుంచి గెలిపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, ఆయనకు ధీటుగా బీజేపీ నుంచి కొడంగల్‌లో ఖతర్నాక్ అభ్యర్థిని నిలబెడతామని అన్నారు.

News July 28, 2024

కథలాపూర్: వ్యవసాయ బావిలో యువకుడి మృతదేహం

image

కథలాపూర్ మండలం సిరికొండ గ్రామ శివారులో వ్యవసాయ బావిలో తిరుమలేష్ (18) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. తిరుమలేష్ గత మూడు రోజుల క్రితం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 28, 2024

ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

image

ఎగువ కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఆదివారం ఉదయానికి ప్రాజెక్టులోకి 23,555 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 81.5 TMCలు కాగా.. ప్రస్తుతం 31.917 TMCలకు చేరింది. గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టులో 72.830TMC నీరు నిల్వ ఉంది.

News July 28, 2024

భీమదేవరపల్లి: తాను పనిచేసే బడిలోనే తన పిల్లలకు చదువులు

image

భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాలిన్ బేగ్ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన తాను పాఠాలు చెబుతున్న పాఠశాలలోని తన ఇద్దరు పిల్లల్ని కూడా చదివిస్తున్నారు. ఇటీవలే కుమార్తె టెన్త్ పూర్తిచేయగా.. కుమారుడు తల్వార్ బేగ్ 9వ తరగతి చదువుతున్నాడు.1 నుంచి 10వ తరగతి వరకు తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలను చదివిస్తూ ఇతరు ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

News July 28, 2024

KNR: శవపరీక్షకు రూ.6 వేలు డిమాండ్

image

చిగురుమామిడి మండలం రేగొండలో శుక్రవారం గొర్రెల కాపరి బొందయ్య బావిలో పడి మృతిచెందిన విషయం తెలిసిందే. శవపరీక్షకు హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యసిబ్బంది రూ.6వేలు డిమాండ్ చేశారని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యడు ఆరోపించారు. బాధిత కుటుంబీకులు రూ.4 వేలు ఇచ్చినా.. ఒప్పుకోకపోలేదని ఆయన తెలిపారు. ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేశ్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడగా డబ్బులు తిరిగి ఇప్పించారన్నారు.

News July 27, 2024

BREAKING.. సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

image

రామగుండం సింగరేణి సంస్థ 2వ భూగర్భ గనిలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. రెండవ షిఫ్ట్ విధులు నిర్వహించేందుకు వెళ్లిన నోయల్, శంకర్, సంపత్‌లకు పైకప్పు కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్.
@ సిరిసిల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో వివాహిత ఆత్మహత్య.
@ నంది మేడారం పంప్ హౌస్ నుంచి నీరు విడుదల.
@ ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచాలన్న పెద్దపల్లి కలెక్టర్.
@ పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్.
@ సౌదీలో బీర్పూర్ మండల వాసి అదృశ్యం.