Karimnagar

News April 1, 2024

పెద్దపల్లి: బైక్ చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి

image

సుల్తానాబాద్ మండలం సుద్దాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన ప్రకారం… ఓదెల మండలానికి శ్రీనివాస్(46) ఓ వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి ఓదెలకు వెళ్తున్న క్రమంలో సుద్దాల సమీపంలో బైక్ అదుపుతప్పి చెట్టుకి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 1, 2024

KNR: BJP నాయకులపై కేసు నమోదు

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SI నరేశ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గన్నేరువరం మండలం మాదాపూర్‌లో EGS పథకంలో సీసీ రోడ్డు నిర్మాణం ఆదివారం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ARO కిరణ్ ఆదేశాల మేరకు FST టీమ్ ఇన్‌ఛార్జ్ రాజశేఖర్ పరిశీలించి BJP నాయకులు తిరుపతి, రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీకాంత్ ప్రారంభించారని నిర్ధారించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.

News April 1, 2024

KNR: ఏప్రిల్5న ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ పర్యటన: ఎమ్మెల్యే గంగుల

image

ఉమ్మడి జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించి, రైతులకు బాసటగా నిలిచేందుకు ఏప్రిల్ 5న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు రానున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. ఎంపీ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ నివాసంలో కేసీఆర్ పర్యటన ఏర్పాట్లలో భాగంగా జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, పలువురి నాయకులతో గంగుల సమావేశం నిర్వహించారు.

News March 31, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్ పల్లి మండలం పెద్దాపూర్ లో వైభవంగా మల్లన్న బోనాల జాతర. @ గంగాధర మండలంలో బిఆర్ఎస్ నాయకుల ధర్నా. @ చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అరెస్ట్. @ సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కరీంనగర్ లో కాలభైరవ స్వామిని దర్శించుకున్న ఎంపీ బండి సంజయ్. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి.

News March 31, 2024

మల్లాపూర్: ఉరేసుకుని వ్యక్తి మృతి

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సంగెం శ్రీరాంపూర్‌లో ఉరేసుకొని వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సంగెం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన నల్లూరి గంగాధర్(34) కొన్ని నెలల నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతడు.. ఈరోజు ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరేసుకున్నాడు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News March 31, 2024

జగిత్యాల పట్టణంలో జోరుగా హైటెక్ వ్యభిచారం!

image

జగిత్యాల పట్టణంలో జోరుగా హైటెక్ వ్యభిచారం కొనసాగుతుంది. అందమైన యువతులు, మహిళల ఫొటోలను దళారులు వాట్సాప్ స్టేటస్గా పెట్టి యువతను ఆకర్షిస్తున్నారు. కేవలం తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఈ హైటెక్ వ్యభిచారం నడిపిస్తున్నట్లు సమాచారం. పోలీస్ అధికారులు ఇలాంటి దళారులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

News March 31, 2024

కరీంనగర్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే!

image

ఇందుర్తిలో శనివారం 41.7℃ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మికుంట 40.6, గంగాధర 40.5, రేణికుంట 39.7, కొత్తపల్లి 39.7, బూర్గుపల్లి 39.3, కరీంనగర్ 39.2, వెంకేపల్లి 39.2, కొత్తగట్టు 39.1, ఆసిఫ్‌నగర్ 38.9, తనుగుల 38.8, వీణవంక 38.8, మల్యాల 38.6, గుండి 38.6, చిగురుమామిడి 38.5, ఏదులగట్టేపల్లి 38.4, ఆర్నకొండ 38.4, చింతకుంట 37.8, బోర్నపల్లి 37.7, వెదురుగట్టు 37.6, దుర్శేడ్ 37.1, గట్టుదుద్దెనపల్లిలో 37.1℃.

News March 31, 2024

KNR: ధాన్యం కొనుగోళ్ళలో ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, మిల్లర్ల సమస్యలపై ఎఫ్సీఐ అధికారులతో సమీక్షిస్తానని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం రబీ కొనుగోలుపై మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా వ్యవహరించి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

News March 30, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సుల్తానాబాద్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య. @ వేములవాడలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు. @ సైదాపూర్ మండలానికి చెందిన ఆర్మీ జవాన్ పంజాబ్ లో మృతి. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ వేములవాడలో వైభవంగా రాజన్న రథోత్సవం. @ నీటిని విడుదల చేయాలని కథలాపూర్ మండలంలో రైతుల ధర్నా. @ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్లు.

News March 30, 2024

ధర్మారం: మనవడిపై తాత గొడ్డలి దాడి

image

ధర్మారం మండలం నంది మేడారంలో సామంతుల మహేష్ (28) శనివారం ఉదయం 1 గంట ప్రాంతంలో హత్యాయత్నానికి గురయ్యాడు. మహేష్ నిద్రిస్తున్న సమయంలో అతడి తాత సామంతుల కొమరయ్య (66) గొడ్డలితో ముఖంపై నరికి హత్యాయత్నం చేశాడు. ఈ మేరకు మహేష్ మేనమామ కట్ట కొమురయ్య దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మారం ఎస్సై టి.సత్యనారాయణ తెలిపారు. సామంతుల కొమరయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.