India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తారని క్యాంప్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 4గం.కు హుస్నాబాద్ నిర్వహించే బోనాల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో బీజేపి నేత సంపత్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
జగిత్యాల డిపో నుంచి శంషాబాద్‌కు టీజీఎస్ RTC రాజధాని బస్సు సర్వీసులు నడపనున్నట్లు RM సుచరిత తెలిపారు. ఈనెల 15 నుంచి నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ బస్సులు జగిత్యాల నుంచి బయల్దేరి KNR, ఉప్పల్ క్రాస్ రోడ్, LBనగర్ మీదుగా శంషాబాద్ చేరుకుంటాయన్నారు. జగిత్యాల నుంచి శంషాబాద్‌కు సాయంత్రం 4:30, రాత్రి 8గం.కు, KNR నుంచి సా.5:45కు, రాత్రి 9:30కు, శంషాబాద్ నుంచి KNR/JGLకు ఉ.7:15, 8 గంటలకు బయల్దేరుతాయన్నారు.
సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అవసరమైతే తాను రక్తదానం చేస్తానని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా ఆస్పత్రిని శనివారం తనిఖీ చేసి బ్లడ్ బ్యాంకులోని రక్తం నిలువలపై ఆరా తీశారు. తనది ఓ నెగిటివ్ రక్తం అని, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అవసరమైతే తన రక్తం అందజేస్తానని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతపై రోగులకు అవగాహన కల్పించాలన్నారు.
8 మంది ఎంపీలను గెలిపించినా BJP తెలంగాణకు మొండి చేయి చూపిస్తోందని BRS నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో ఉందన్నారు. అదే షెడ్యూల్లో ఇచ్చిన హామీ మేరకు ఆయిల్ రిఫేనరీ కంపెనీని ఏపీకి ఇస్తున్నారని.. మరి తెలంగాణకు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.
హుజూరాబాద్ పట్టణంలోని వైన్ షాపులో ఓ వ్యక్తి బీరు తాగుతుండగా పురుగు వచ్చింది. గమనించి అతడు ఒక్కసారిగా వాంతి చేసుకున్నాడు. వెంటనే ఆ బీరును పట్టుకెళ్లి వైన్ షాపులో చూపించగా సదరు షాపు నిర్వాహకుడు దాని బదులు వేరే బీర్ ఇచ్చాడు. ఈ విషయం హుజూరాబాద్ పట్టణంలో వైరల్‌గా మారింది.
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో 61 ఏళ్లు పైబడిన 3,797 మంది వీఆర్ఏల స్థానంలో దశాబ్ద కాలంగా విధులు నిర్వహిస్తున్న వారి వారసులను నియమించాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులు శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని వారి నివాసంలో కలిశారు. అనంతరం ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.
శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అంజన్న డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. శాతవాహన యూనివర్సిటీని గత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వెనుకబాటుకు గురి చేస్తున్నాయన్నారు. మౌలిక వసతులు కల్పించలేకపోవడం సిగ్గు చేటన్నారు. శాతవాహన యూనివర్సిటీలోని కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని, కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అంజన్న డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. శాతవాహన యూనివర్సిటీని గత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వెనుకబాటుకు గురి చేస్తున్నాయన్నారు. మౌలిక వసతులు కల్పించలేకపోవడం సిగ్గు చేటన్నారు. శాతవాహన యూనివర్సిటీలోని కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని, కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూముల ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. KNR రూరల్ మండలంలోని ఓ రైతు ఇటీవల రెండెకరాల భూమిని కొనుగోలు చేశాడు. అతడికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.42 వేలకు పైగా ఖర్చయింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ పెరిగితే కనీసం రూ.60 వేలు ఖర్చవుతుంది. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి.
జిల్లాలోని 18 ఏళ్లలోపు బాలల సంరక్షణకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ నంబర్ 9490881098తో కూడిన కంట్రోల్ రూమ్‌ను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలోని బాల రక్షాభవన్లో ఏర్పాటు చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి తెలిపారు. ఈ నంబర్‌కు అత్యవసరమైన సమయంలో ఫోన్, వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.