India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముంబైలో పెద్ద ఎత్తున లావాదేవీలను నడిపిన ముఠా ఆనవాళ్లు KNRలో బయటపడ్డాయి. అంతర్జాతీయ స్థాయి సైబర్ మోసంలో భాగంగా భారీనగదు బదిలీచేసిన ముఠాలోని కీలక వ్యక్తులను KNRలో పట్టుకున్నారు. ముంబై నుంచి వచ్చిన ఇద్దరు CIలు, ఇద్దరు SIలు, నలుగురు కానిస్టేబుళ్లు విచారణ జరిపి పలు వివరాలను సేకరించారు. అనంతరం ఇద్దరిని వదిలేసి, ఒకరిని అదుపులోనే ఉంచారు. ఇదే కేసులో కీలకంగా భావిస్తున్న మహిళ కోసం ఆరా తీస్తున్నట్లు సమాచారం.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలపై ఇప్పటివరకు విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్.. ఇకపై ఆర్థిక అవకతవకలపై దృష్టి సారించనుంది. బ్యారేజీలకు తొలుత పరిపాలనాపరమైన అనుమతి ఎంత? మధ్యలో ఎన్నిసార్లు అంచనాలను సవరించారు? వాస్తవ వ్యయం ఎంత? సబ్ కాంట్రాక్టర్లకు ఎంతిచ్చారనే కోణంలో విచారణ చేపట్టనున్నారు. ఇందుకుగాను ఒక CAను సమకూర్చాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఉమ్మడి KNR వ్యప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. రెండ్రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి(M)లో డెంగ్యూ కేసు నమోదైంది. ఈ ఏడాది మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతున్నవారి సంఖ్య లెక్కలోకి రావట్లేదు. జిల్లాలో 17 గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 6 ప్రాంతాలను డెంగ్యూ హైరిస్క్ ప్రాంతాలుగా వైద్యాధికారులు గుర్తించారు.
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల ప్రగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శపాఠశాల పనులు సకాలంలో ముగించాలన్నారు. కార్యక్రమములో ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, జిల్లా విద్యాధికారి బి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
సిరిసిల్లలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఔత్సాహికులు తమ ఆవిష్కరణల వివరాలు ఆగస్టు 3లోగా పంపాలని కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. గురువారం తన ఛాంబర్లో ఇంటింటా ఇన్నోవేషన్ 2024 పోస్టర్ ఆవిష్కరించారు. తమ ఆవిష్కరణకు సంబంధించిన 2 నిమిషాల నిడివి వీడియో, 4 ఫోటోలు, పేరు, ఫోన్ నంబర్, వయసు, గ్రామం, జిల్లా పేరు తదితర వివరాలతో 9100678543కు వాట్సాప్ చేయాలన్నారు.
KNR కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో వనమహోత్సవం కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామపంచాయితి, మున్సిపాలిటీల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు 15శాతం మొక్కలు మాత్రమే హోం ప్లానిటేషన్ కు కేటాయించాలని, 85 శాతం ఇతర ప్లానిటేషన్ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
రైలు ఢీకొని సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఓదెల గ్రామానికి చెందిన రామినేని శంకరయ్య(68) పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో 1వ ప్లాట్ ఫారం నుంచి 2వ నంబర్ ప్లాట్ ఫారం వైపు రైల్వే ట్రాక్ పైనుంచి దాటుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టండతో అతడు మృతి చెందినట్టు పేర్కొన్నారు.
చిన్నారులు, మహిళల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో వినూత్నంగా శుక్రవారం సభను నిర్వహించాలని అధికారులను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని చెప్పారు. గర్భిణులు పోషకాహార లోపంతో బాధపడకుండా చూడాలని తెలిపారు. మాతాశిశు మరణాలు తగ్గడానికి పూర్తిగా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. దీనికి 2004 జులై 3 నుంచి 2008 జనవరి 3 మధ్య జన్మించి పెళ్లికాని యువతీ, యువకులు అర్హులని చెప్పారు. జులై 28లోగా https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు వెబ్ సైట్ చూడాలని కోరారు.
కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి విఫలమయ్యారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలో కేంద్ర టూరిజం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఒక్క రూపాయి తీసుకురాలేదని ఆరోపించారు. స్థానిక సంస్థలకు 73, 74 రాజ్యాంగం ద్వారా వచ్చే 15వ ఫైనాన్స్ నిధులు తప్ప అదనంగా ఒక్క రూపాయి కిషన్ రెడ్డి తీసుకురాలేదన్నారు. హైదరాబాద్ ఇమేజ్‌కి భంగం కలిగించేలా కిషన్ మాటలు ఉన్నాయని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని పొన్నం అన్నారు.
Sorry, no posts matched your criteria.