Karimnagar

News March 18, 2024

కరీంనగర్: 144 సెక్షన్ అమలు

image

పదో తరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేది వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. KNR జిల్లా వ్యాప్తంగా 219 సెంటర్లు ఏర్పాటు చేయగా, 38,097 మంది పరీక్ష రాయనున్నారు.

News March 18, 2024

ధర్మారం: క్షుద్ర పూజల కలకలం

image

ధర్మారం మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద క్షుద్ర పూజ కలకలం రేపింది. ఆదివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో నడి రోడ్డుపై ఆకులపై పసుపు, కుంకుమ, నిమ్మకాయ, కోడి గుడ్డు పెట్టారు. ఇది చూసిన స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

News March 18, 2024

కరీంనగర్: జిల్లాలో నెత్తురోడుతున్న రహదారులు

image

ఉమ్మడి జిల్లాలో రహదారులు నిత్యం రోడ్డు ప్రమాదాలతో నిత్తురోడుతున్నాయి. రోజు ప్రమాదాలలో కొందరు గాయపడుతుండగా, మరికొందరు మరణిస్తున్నారు. శనివారం మెట్పల్లి వద్ద ముగ్గురు మహిళలను గుర్తు తెలియని వాహనం ఢీకొనగా గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ వ్యక్తి మరణించారు. ఆదివారం ఉదయం జగిత్యాల కోరుట్ల ప్రధాన రహదారిపై ఆగిఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో కొండగట్టుకు చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు.

News March 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ గంభీరావుపేట మండలంలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య. @ తంగళ్ళపల్లి ఎంపీటీసీకి రిమాండ్ విధించిన పోలీసులు. @ కోరుట్ల మండలంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి. @ రేపు జగిత్యాలలో విజయ సంకల్ప సభలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ. @ జగిత్యాలలో రేపటి ప్రజావాణి రద్దు. @ జగిత్యాలలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ అరవింద్.

News March 17, 2024

KNR: పురుగు మందు తాగి సూసైడ్

image

గంగాధర మండలం గట్టు బూత్కూర్ గ్రామానికి చెందిన బొమ్మరవేణి దశరథం (40) అనే వ్యక్తి తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 17, 2024

ఎల్లారెడ్డిపేట: గల్ఫ్‌ పంపిస్తానని మోసం

image

ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి, సింగారం,గొల్లపల్లి గ్రామాలకు చెందిన ఐదుగురిని 15 రోజులలో గల్ఫ్‌ పంపిస్తానని గల్ఫ్ ఏజెంట్ మోసం చేయగా బాధితులు లబోదిబోమంటున్నారు. యువకులను విదేశాలకు పంపిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.80వే ల చొప్పున సుమారు రూ.4 లక్షలు తమ వద్ద వసూలు చేశాడని.. రెండు నెలలు కావస్తున్న ఇంతవరకు తమను పంపించలేదని సెల్ ఫోన్ చేస్తే ఎత్తడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

News March 17, 2024

మల్లారెడ్డిపేటలో గడ్డి మందు తాగి ఒకరు మృతి

image

గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కడేలా దేవయ్య (46) అనే వ్యక్తి తీవ్ర అప్పులతో బాధపడుతున్నారు. ఇదే క్రమంలో శనివారం బిల్డింగ్ పైన గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న దేవయ్య ఆదివారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు పోలీసులు మేరకు కేసు నమోదు చేశారు.

News March 17, 2024

ఎల్లారెడ్డిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజి వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కేసీఆర్ కాలనీకి చెందిన మంద నారాయణ(56) అనే వ్యక్తి హమాలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం రాత్రి రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 17, 2024

ఓదెల: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

image

ఓదెలకు చెందిన వెంకటసాయి(28) బీటెక్ పూర్తి చేసుకుని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా తన సోదరుడు, సోదరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. తనకు తక్కువ వేతనం ఉండి, చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని కొద్ది రోజులుగా మనస్తాపానికి గురవుతున్నాడు. దీంతో శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. HYDలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పొత్కపల్లి పోలీసులు తెలిపారు.

News March 17, 2024

పెద్దపల్లి: BSPకి దాసరి ఉష రాజీనామా

image

పెద్దపల్లి BSP ఇన్‌ఛార్జ్, దాసరి ఉష పార్టీకి శనివారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర BSP మాజీ అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్‌తో చర్చించి ఆయన రాజీనామా అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనను నాయకురాలిగా తీర్చిదిద్దిన పార్టీకి రుణపడి ఉంటానని చెప్పారు. కాగా, మోదీ బెదిరింపులతోBSP, BRS పొత్తు రద్దు కావడంతో వీరు రాజీనామా చేశారు.