India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డయేరియా వ్యాధి నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారులు డయేరియా వ్యాధి బారిన పడకుండా వైద్యాధికారులు ప్రత్యేకచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయేరియా నివారణకు కృషిచేయాలన్నారు. ఈ వ్యాధి నివారణ తీసుకోవాల్సిన చర్యలపై ప్లాష్ మాబ్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు.
కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని అంధుల పాఠశాలలో ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీనికి యాజమాన్యం నిర్లక్ష్యం కారణమంటున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. గదిలో మెడకు తాడు చుట్టుకుని అపస్మారక స్థితిలో కనిపించిన యువకుడి మృతదేహం. పాఠశాల వద్ద విద్యార్థి తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చేపట్టారు.
కరీంనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానిక సాయినగర్ సాయిబాబా ఆలయం ఎదుట బిక్షాటన చేసే వ్యక్తి మృతిచెందాడు. టూ టౌన్ పోలీసులు వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడు ఎరుపు రంగు డబ్బాల షర్ట్, జీన్ పాయింట్ వేసుకున్నాడు. అతడి వయసు 50 నుంచి 55 ఉండొచ్చిన తెలిపారు. సమాచారం తెలిసిన వారు తమని సంప్రదించాలని వారు తెలిపారు.
అధికారులు, ప్రజలు అందరం కలిసి డ్రగ్స్ అనే మహమ్మారిని జిల్లా నుంచి తరిమికొడదామని, డ్రగ్స్ రహిత జిల్లాగా తయారు చేద్దామని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణపై ఎక్సైజ్‌శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అవగాహన సమావేశం నిర్వహించారు. యువత డ్రగ్స్, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యసనాల బారిన పడి యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు.
పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి వద్దకు తల్లితో వచ్చిన బాలుడు.. ఆడుకుంటూ వెళ్లి మూత తెరిచిఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డాడు. కాగా, మృతుడి కుటుంబం MHBD జిల్లాకురవి మండలం సుదనపల్లికి చెందినవారు కాగా.. ఉపాధి నిమిత్తం పెద్దపల్లిలో ఉంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంపై ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చిగురుమామిడి మం. లాలయ్యపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1-5 తరగతుల్లో 30 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ స్కూల్‌లో రెండు గదులు ఉండగా ఒకటి శిథిలావస్థకు చేరింది. దీంతో వర్షం పడితే అన్ని తరగతుల విద్యార్థులకు ఒకే గదిలో పాఠాలు చెబుతున్నారు. మిగతా సమయాల్లో బయట చెబుతున్నారు.
వేములవాడలోని అగ్రహారం ఆంజనేయస్వామి హుండీ లెక్కింపును ఈనెల 10న నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి మారుతి వెల్లడించారు. ఆలయ ఆవరణలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు హాజరు కావచ్చునని ఆయన తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. కాళేశ్వరంపై రిపోర్ట్‌ను కమిషన్‌కు కాగ్(CAG) అందజేసింది. ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్ ఫైనల్ రిపోర్టు ఇవ్వాలని మరోసారి కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. సోమవారం 14 మంది పంప్ హౌస్ ఇంజినీర్లను విచారించిన కమిషన్.. ఈనెల 16లోపు కమిషన్‌కు నివేదించిన సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో అందించాలని అధికారులను ఆదేశించారు.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భారీ ప్యాకేజీ సంపాదించి KNR జిల్లాకు చెందిన ఓ యువతి ఔరా అనిపించింది. HZBDకు చెందిన CSE విద్యార్థిని యాల్ల కృష్ణవేణి ఓ కంపెనీలో రూ.34.4 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందింది. కృష్ణవేణి మాట్లాడుతూ.. తమది మధ్య తరగతి కుటుంబం కావడంతో నాన్న కష్టం చూసి చదివానని, భారీ ప్యాకేజీతో పొందడం సంతోషంగా ఉందని పేర్కొంది. కోడింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించడం తనకు కలిసొచ్చిందని తెలిపింది.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపెల్లికి చెందిన ఓ యూట్యూబ్ ఛానల్ యాక్టర్ రసూల్ ప్రభాస్ కల్కి సినిమాలో నటించి అందరి మన్నులను పొందాడు. గతంలోనూ సత్తి గాని రెండెకరాల సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఆ సినిమా వేడుకల్లో కల్కి డైరెక్టర్ నాగ అశ్విన్ హాజరయ్యారు. ఈ క్రమంలో రసూల్(మని వర్షిత్) చురుకుదనాన్ని గుర్తించి కల్కి సినిమాలో అవకాశం ఇచ్చినట్లు యూట్యూబ్ ఛానల్ టీం వాళ్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.