India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలో భార్యను చంపి భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఉపాధికోసం బహ్రెయిన్ వెళ్లి ఆదివారం ఇంటికి వచ్చిన భర్త లింగం.. అనుమానంతోనే భార్యను తలపై కొట్టి చంపేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అసిఫాబాద్ రోడ్ నుంచి రేచిని రోడ్ మధ్య జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల వల్ల తాత్కాలికంగా రద్దయిన ప్యాసింజర్ రైళ్లను నేటి నుంచి యథావిధిగా నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. 12757/58 కాగజ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 12733/34 భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, 17033/34 సింగరేణి ప్యాసింజర్ రైలు,17003/04 రామగిరి, 07765/66 కరీంనగర్ పుష్‌పుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.
వేములవాడ టూ అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు RTC ఆర్ఎం తెలిపారు. వేములవాడ రాజన్న సన్నిధి నుంచి తమిళనాడులోని అరుణాచలం దివ్యక్షేత్రానికి స్పెషల్ బస్సు వేసినట్లు కరీంనగర్ రీజనల్ ఆర్టీసీ మేనేజర్ సుచరిత పేర్కొన్నారు. ఈనెల 19న రాత్రి 8 గంటలకు వేములవాడ నుంచి ఈ బస్సు బయలుదేరుతుంది. KNR మీదుగా వెళ్లి ఈనెల 20న రాత్రి 8 గంటలకు అరుణాచలానికి చేరుకొని.. తిరిగి 22న KNRకు చేరుకుంటుందన్నారు.
ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 8 నుంచి 11 వరకు టీ-శాట్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రసారమవుతాయన్నారు. జూలై 8న ఇంగ్లీషుపై, జూలై 9న సైన్స్, జూలై 10న గణితంపై, జూలై 11న తెలుగు, హిందీ, ఉర్దూ సబ్జెక్టుపై ప్రత్యక్ష ప్రసారాలు చేస్తామని టీ-శాట్ సీఈవో తెలిపారు.
@ జగిత్యాల జిల్లాలో 22 గ్రామాలకు మీ సేవ కేంద్రాల మంజూరు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్ పల్లి పట్టణంలో వైభవంగా జగన్నాథ రథయాత్ర. @ ముస్తాబాద్ మండలంలో సినీ పక్కిలో పేకాటరాయుళ్ల పట్టివేత. @ వేములవాడ, ఓదెల మండలంలో భారీ వర్షం. @ జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే.
ఆధునికసాగుతో కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన చిగుర్లు ఆశాలు ఒకేరోజు 8 ఎకరాల్లో వరినాటు వేశాడు. ఆశాలు డ్రమ్ సీడర్ తో 8ఎకరాలు సాగుచేయడం వల్ల సమయంతో పాటు, కూలీల ఖర్చులు ఆదా అయ్యిందని తెలిపారు. 8ఎకరాలకు తనకు రూ.2400 మాత్రమే ఖర్చయినట్లు తెలిపాడు.
రామాయణ సర్క్యూట్ కింద ఇల్లందకుంట, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని.. అందుకోసం తాను తప్పకుండా కృషి చేస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతానన్నారు. ప్రతిపాదనలు పంపాలని గత ప్రభుత్వాన్ని అనేకమార్లు కోరినా పంపలేదన్నారు .
పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 15న పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏటా ఏకాదశి ముందు పెద్ద పట్నాలు, అగ్నిగుండ మహోత్సవం పెద్దఎత్తున నిర్వహిస్తారు. కావున భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ అధికారులు కోరారు.
అనుమానాస్పద స్థితిలో ఓవ్యక్తి మృతి చెందాడని కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాలు.. కేశవపట్నం మండలం గడ్డపాకకు చెందిన చిత్తారి రత్నం సుభాష్‌నగర్‌లో అద్దెకు ఉంటూ కరెంట్ పోల్స్ సబ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. అర్దరాత్రి అతడి నోట్లో నురుగులు రావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. మృతుడి సోదరుడు రాజు ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇల్లంతకుంట మండలం వంతడుపులకి చెందిన అనిల్-శిరీష దంపతులు ఐదేళ్ల బాలుడు అయాన్ష్ జ్వరంతో బాధపడుతుండగా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు బాలుడికి ఇంజక్షన్ ఇవ్వడంతో మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు.
Sorry, no posts matched your criteria.