India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఆరెపల్లి మోహన్ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర నాయకులు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్య చరణ పై త్వరలోనే వెల్లడిస్తానని ఆరేపల్లి మోహన్ తెలిపారు.
రామగుండం NTPC పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జీ వద్ద దర్శన్ సింగ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నిన్న మధ్యాహ్నం లాడ్జింగ్‌కు వచ్చిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా? లేక మరేదైనా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చత్తీస్ ఘడ్‌లో ఉన్న మృతుని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఏఐసిసి అధిష్టానం మరో కీలక పదవిని అప్పజెప్పింది. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మంత్రి శ్రీధర్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రామగుండం ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ అనుబంధ పార్టీ సెక్రటరీ జనక్ ప్రసాద్‌కు సభ్యుడుగా నియమిస్తే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి, సీనియర్ న్యాయవాది మాకునూరి హన్మంతరావు కొద్దిసేపటి క్రితం మరణించారు. పార్థివదేహాన్ని హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఎమ్మెల్యే గృహంలో ఉంచారు. కాగా, ఈరోజు రాత్రి 8 గంటలకు మోతే శ్మశానవాటిక(శంకర్ ఘాట్)లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పలువురు ప్రముఖులు పరామర్శించారు.
సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, కోరారు. విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని కోరారు. గత 27 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించి సమ్మె విరమింపచేసేలా కృషి చేయాలని లేఖలో పేర్కొన్నారు.
ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం..జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు గురువారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లాడు. గ్రామ శివారులోని పాడుబడ్డ కోళ్ల ఫారంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయికల్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కొండగట్టు ఆలయ పరిసరాల్లో ఓ భక్తుడు మృతి చెందినట్లు ఏఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కొంపెల్లి రాజు (48) 4 రోజుల కిందట కొండగట్టు ఆలయానికి వచ్చినట్లు వివరించారు. గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందినట్లు 108 సిబ్బంది ధ్రువీకరించారు. రాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం తీసుకుని వెళ్లినట్లు పేర్కొన్నారు.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ దూర విద్య డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం (2023-24) ప్రవేశాలు అపరాధ రుసుం రూ.200తో ఈనెల 31 వరకు పొందే అవకాశం విశ్వవిద్యాలయం కల్పించింది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఓపెన్ యూనివర్శిటీ కరీంనగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి డాక్టర్ ఆడెపు శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా బొగ్గు ఉత్పత్తికి చేరువగా ఉంది. ఏడాది 70 మి. టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ నిర్దేశించగా ఈనెల 27 వరకు 69.09 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి టార్గెట్ కు సమీపంలో చేరుకుంది. గతేడాది కూడా బొగ్గు ఉత్పత్తి టార్గెట్ కు చేరుకోలేదు. అలాగే గతేడాది లో సంస్థ రూ.2,222 కోట్లు లాభాలు సాధించగా ఈ ఏడాది మరింత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి విధులకు గైర్హాజరైన గన్నేరువరం మండలం హనుమాజిపల్లి ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ భాగ్యలక్ష్మిని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు సస్పెండ్ చేశారు. విధులకు ఆలస్యంగా హాజరైన మరో ఇద్దరు ఉపాధ్యాయులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా పాఠశాలకు గైర్హాజరైన సిబ్బంది వివరాలు తమ దృష్టికి తీసుకువస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Sorry, no posts matched your criteria.