Karimnagar

News March 29, 2024

జగిత్యాల: హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్ట్

image

జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో ఈ నెల 25న మేడిశెట్టి రమను హత్య చేసిన నిందితుడు బోగు ప్రకాశ్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ ఆరీఫ్ అలీఖాన్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల శివారులో గల లక్ష్మీగార్డెన్ వద్ద నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి బైక్, కొడవలి, ఫోను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

News March 29, 2024

జగిత్యాల: ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో బయట వ్యక్తులతో కలిసి పార్టీ చేసుకున్న ఘటనలో కానిస్టేబుళ్లు ధనుంజయ్, సురేశ్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఘటనలో హెడ్ కానిస్టేబుల్ అశోక్‌పై శాఖ పరమైన చర్యల నిమిత్తం మల్టీ జోన్-1ఐజీకి నివేదిక పంపించామని, ఆ నివేదిక ఆధారంగా అతడిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News March 29, 2024

కాంగ్రెస్ కరీంనగర్ టికెట్ ఎవరికి?

image

కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నెల 31న నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు పేర్లు వినిపించగా.. కొత్తగా తీన్మార్ మల్లన్న పేరు తెరమీదకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ KNR, సిరిసిల్ల, సిద్దిపేట, HNK డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిసింది. బరిలో నిలిచేదెవరో కామెంట్?

News March 29, 2024

జగిత్యాల జిల్లాలో 1,18,824 హెక్టార్ల వరి సాగు

image

జగిత్యాల జిల్లాలో 2023 – 24 సీజన్‌లో 1,18,824 హెక్టార్ల వరిసాగు జరిగిందని దీనికి గాను 565241 mts ల వరిధాన్యం కొనుగోలు కొరకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష గురువారం తెలిపారు. ఈ యాసంగి సీజన్లో వరి ధరలు గ్రేడ్ ఎ 2203, కామన్ ధరలు 2183గా ఉన్నాయన్నారు. ఈ సీజన్‌కు గాను ఐకెపి 133, పీఎసీఎస్ 282, మెప్మా 1, మొత్తం 416 వరి కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించినట్టు ఆమె తెలిపారు.

News March 29, 2024

సిరిసిల్ల: ఆధారాలు లేకుండా తరలిస్తే సీజ్ చేయండి: కలెక్టర్

image

ఎటువంటి ఆధారాలు లేకుండా రూ.50,000 మించి నగదు తరలిస్తే సీజ్ చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ స్టేజి వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్ వద్ద కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం వాహనాల ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పంపించాలని అధికారులు ఆయన ఆదేశించారు.

News March 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్. @ తాగునీటి కొరత లేకుండా చూడాలన్న జగిత్యాల కలెక్టర్. @ రాయికల్ మండలంలో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్. @ వేములవాడలో వైభవంగా శివ కళ్యాణం. @ చందుర్తి మండలంలో చోరీ. @ జగిత్యాల మండలంలో హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్ట్. @ గంభీరావుపేట మండలంలో చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.

News March 28, 2024

మేడిపల్లిలో గుర్తుతెలియని మృతదేహం

image

మేడిపల్లి మండలం కొండాపూర్ శివారులోని గల ఎస్సారెస్పీ వరద కాలువలో గుర్తుతెలియని వ్యక్తి శవం కొట్టుకొచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉన్నట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఎవరు..? ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? ప్రమాదవశాత్తు జారిపడ్డాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 28, 2024

కరీంనగర్: భర్తను కొట్టి చంపిన భార్య

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో దారుణం జరిగింది. భర్త రోజు తాగి వచ్చి తరచూ గొడవ చేస్తున్నాడన్న నెపంతో రోహితి అనే మహిళ తన భర్త హేమంత్‌ను హత్య చేసింది. పడుకొని ఉన్న భర్తపై వేడి నీళ్లు పోసి అనంతరం తీవ్రంగా కొట్టి గాయపర్చింది. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 28, 2024

పెద్దపల్లి: విలాసాలకు అడ్డొస్తుందని భార్యను హతమార్చిన భర్త

image

విలాసాలకు అడ్డు వస్తుందని భార్యను భర్త హత్యచేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ACP కృష్ణ వివరాల ప్రకారం.. ఈ ఘటనలో జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారెడుపల్లికి చెందిన రజిత(33) మృతి చెందింది. అయితే కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన భర్త పున్నం రెడ్డి రోజూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడి, ఇనుపచైన్‌పానతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

News March 28, 2024

నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి టీ.జీవన్ రెడ్డి నేపథ్యమిదే!

image

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా టీ.జీవన్ రెడ్డిని ఆపార్టీ అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. ఈయన 1983లో TDP నుంచి తొలిసారిగా జగిత్యాల MLAగా ఎన్నికై.. మంత్రివర్గంలో చేరారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌లో చేరి 1989, 1996, 1999, 2004, 2014లలో కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా గెలిచారు. 2019లో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ MLCగా ఎన్నికయ్యారు.