India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో మద్యానికి బానిసై యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐతం అజయ్(25) అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ ఇరుగుపొరుగు వారితో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో మద్యానికి బానిసై యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐతం అజయ్(25) అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ ఇరుగుపొరుగు వారితో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల ఘటనపై మరోసారి నిష్పక్షపాత విచారణ నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామ్ చందర్ అన్నారు. సిరిసిల్లలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అన్యాయం జరిగిన నిమ్న వర్గాల ప్రజలకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుందన్నారు. ఎస్సీలకు కేటాయించిన అసైన్డ్ ల్యాండ్స్ పట్టాలు అందించే అవకాశంపై రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించి ఆదేశాలు జారీ చేశామన్నారు.
కరీంనగర్ అడిషనల్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఆదేశాల మేరకు మంగళవారం నగరపాలిక ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు. నాలుగు ఆస్పత్రులు బయో మెడికల్ వ్యర్థాలను నిర్వీర్యం చేయకుండా చెత్తతో కలిపి ఇస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారు BMW నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు.
జగిత్యాల జిల్లా కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలు బాధించాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. తనపై విమర్శలు చేసే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. గతంలో ఇతర పార్టీల్లో గెలిచినవారిని ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పని చేస్తే జగిత్యాల అభివృద్ధి చెందుతుందని భావించానని వెల్లడించారు.
జమ్మికుంట పత్తి మార్కెట్‌లో పత్తి ధర నిలకడగానే కొనసాగుతుంది. మంగళవారం మార్కెట్‌కు రైతులు 12 వాహనాల్లో 184 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,500, కనిష్ఠంగా రూ.7,200 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తి ధరలు పెరగకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. మార్కెట్లో కొనుగోలు పక్రియ జోరుగా సాగుతుంది.
కొత్త న్యాయ, నేర చట్టాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 10 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేసులు, జగిత్యాల జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మొదటి రోజు కేసుల నమోదు, సెక్షన్ల నమోదు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
జగిత్యాల జిల్లా ధర్మపురిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయ్యింది. పట్టణంలోని
అంబేడ్కర్ చౌరస్తాలోని కమలాపూర్ రోడ్డులో మంగళవారం వేకువజామున కంకర కుప్పపై స్థానికులు వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్‌లో సోమవారం రాత్రి 11:30 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. కొద్దిసేపటికి బ్యాంకు నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు సమీపంలోని ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని అదుపుచేశారు. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రామగుండం సింగరేణి సంస్థ RG-1లో గత నెల 103% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు GMచింతల శ్రీనివాస్ తెలియజేశారు. జూన్‌లో 3,58,900 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికిగానూ 3,70,418 టన్నులతో 103% ఉత్పత్తి సాధించామన్నారు. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను RG- 1 ఏరియాకు 49,40,000 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించామన్నారు.
Sorry, no posts matched your criteria.