India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సరిహద్దులో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లు ఉండటంతో మావోయిస్టు కార్యకలాపాలపై దృష్టిసారించిన సీపీ.. ఆయా ప్రాంతాల్లో మరింత బందోబస్తు ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఎస్టీ సామాజికవర్గ మహిళలపై జరిగిన దాడిని ఎంపీ బండి సంజయ్ ఖండించారు. సోమవారం ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రజాకార్ల అరాచకాలను చూపిస్తే, కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరమ్మ పాలన ఎలా ఉందో చూపించాలని అనుకుంటున్నారా..? అని ధ్వజమెత్తారు. హిందువులపై దాడులు చేసిన వారిని వదిలేసి దారులకు గురైన వారిపైనే లాఠీ చార్జి చేస్తారా..? అని ప్రశ్నించారు.
జగిత్యాల పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 27, 28న ఉత్తర తెలంగాణ జోన్ వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశాలను నిర్వహిస్తున్నట్లు సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాస్, డిఏఓ బి. వాణి తెలిపారు. గత సీజన్లలో పంటల సాగులో తలెత్తిన సమస్యలను చర్చించి, వచ్చే సీజన్లకు చేపట్టాల్సిన పరిశోధన కార్యాచరణను రూపొందిస్తారని తెలిపారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం 15కు పైగా సంస్థలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. టీ. శ్రీలక్ష్మి, టీఎస్సీ కోఆర్డినేటర్ డా. సీహెచ్. శోభారాణి తెలిపారు. ఇందులో భాగంగా 2021 నుంచి 2024 వరకు పీజీ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం పిఎఫ్ మీ ముంగిట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ తానయ్య తెలిపారు. హుజరాబాద్ పెద్ద పాపయ్యపల్లి నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ డైరీలో, పెద్దపల్లి పురపాలక కార్యాలయంలో, జగిత్యాల(D) కోరుట్ల రవి బీడీ వర్క్స్ కార్యాలయంలో, సిరిసిల్ల (D) పెద్దూరు గ్రీన్ నీడిల్ లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5:45 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
హోలీ వేళ రాయికల్‌లో వ్యవసాయ బావిలో పడి యువకుడు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన నర్ర నగేశ్(21) తన నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం దావత్ కోసం ఓ మామిడితోటకు వెళ్లారు. అక్కడ బహిర్భూమికోసం బావి వద్దకు వెళ్లిన నగేశ్ తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు, పోలీసులకు స్నేహితులు చెప్పారు. అందరూ కలిసి గాలించగా బావిలో శవమై కనిపించాడు.
గోదావరిఖని దుర్గానగర్‌కు చెందిన లక్కీ(4) అనే బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినోద్ అనే కూలీ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం కుటుంబంతో గోదావరిఖనికి వచ్చి స్థిరపడ్డాడు. వినోద్ కొడుకు సోమవారం ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ముఖంపై గాయం కావడంతో సర్జరీ కోసం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. కుక్కల బెడదను తొలిగించాలని స్థానికులు కోరుతున్నారు.
ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు ఇస్తున్న 2 నెలల ఉచిత కోచింగ్ దరఖాస్తు గడువు నేటి ముగుస్తుందని ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి. నరేష్ తెలిపారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు చెందిన బీ.ఎడ్డీ లేదా డీ.ఎడ్‌తో పాటు టెట్ పాసైన ఎస్సీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలన్నారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు. @ కమలాపూర్ మండలం లో ఆటో బోల్తా పడి యువకుడి మృతి. @ కోనరావుపేట మండలంలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య. @ రాయికల్ మండలంలో ఎస్సారెస్పీ కాలువలో పడి మానసిక దివ్యాంగుడు మృతి. @ రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు. @ గోదావరిఖనిలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు.
జిగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని చర్లపల్లి-గుల్లకోట గ్రామాల మధ్య భూసరిహద్దు సమస్య సోమవారం రోజున తారస్థాయికి చేరింది. చర్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు సోమవారం గ్రామ సమీపంలో ఉన్న గుట్టకు ఉపాధి కూలీ పనులకు వెళ్తుంటే గుల్లకోట మాజీ సర్పంచ్ గ్రామస్థులతో కలిసి తమ సరిహద్దులో ఉన్న గుట్టకు ఉపాధిపని కోసం రావద్దన్నారు. దీంతో ఇరు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
Sorry, no posts matched your criteria.