Karimnagar

News March 25, 2024

కొండగట్టు అంజన్న ఆలయ ఈఓ (ఇంచార్జ్)గా చంద్రశేఖర్ బాధ్యతలు

image

తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఈఓ(ఇంచార్జ్ )గా సోమవారం అసిస్టెంట్ కమిషనర్ (కరీంనగర్) చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కొండగట్టు ఈఓ టంకాశాల వెంకటేష్ సస్పెన్షన్‌కు గురికాగా, చంద్రశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ రోజు బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్‌కి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

News March 25, 2024

కరీంనగర్: మత్తుకు బానిస!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు, యువత మత్తుకు బానిసలవుతున్నారు. ఉన్నత చదువులు చదివి కన్నవారి కలలు నెరవేర్చాల్సిన పిల్లలు వ్యసనాలకు బానిసై బంగారు భవితను పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులూ తమ పిల్లలను గమనించి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. జగిత్యాలలో బాలికలకు ఓ ముఠా మత్తు మందు ఇచ్చి రేవ్‌ పార్టీలకు తీసుకెళ్తోందనే విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

News March 25, 2024

కొండగట్టు నిధుల దుర్వినయోగంపై లోతుగా దర్యాప్తు!

image

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నిధుల దుర్వినియోగంపై దేవదాయశాఖ ఉన్నతాధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఆలయానికి సంబంధించి 2014 నుంచి రికార్డుల పరిశీలనకు నిర్ణయించినట్లు, క్యాష్‌బుక్‌, బ్యాంకు స్టేట్‌మెంట్లు ఇతర ఫైళ్లను రీకన్సులేషన్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.గతంలో పనిచేసిన ఈవోల పదవీకాలంలోనూ నిధుల దుర్వినియోగం జరిగినట్లు అధికరులు భావిస్తున్నారు.

News March 25, 2024

కరీంనగర్: యువతిపై అత్యాచారం

image

ఓ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన HYD KPHBలో జరిగింది.పోలీసుల వివరాల ప్రకారం..కరీంనగర్‌కు చెందిన ఓ యువతి(30) సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి సంబంధించిKPHBలో ఆన్‌లైన్‌ శిక్షణకు చేరింది. ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు నరేందర్ కుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు.ఈ విషయం శిక్షణ సహచరుడు సంతోష్‌కు తెలపగా అతడు కూడా ఆమెను వేధించాడు.దీంతో ఆమె KNRలోని ఆమె ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసింది. నరేందర్, సంతోశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

News March 25, 2024

కరీంనగర్: రంగుల విషయంలో జాగ్రత్త!

image

చిన్నా, పెద్ద, ధనిక, పేద, కుల, మత భేదాలు లేకుండా చేసుకునే పండగల్లో హోలీ ప్రధానమైంది. జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ బంధువులు, మిత్రులపై రంగులు చల్లుతూ.. ఆనందోత్సాహాలతో ఈ వేడుక నిర్వహించుకుంటారు. అయితే రంగుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సహజ రంగులు కాకుండా రసాయనాలు ఉండే రంగులు ఎక్కువకాలం శరీరంపై ఉండేవి కళ్లు, చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News March 24, 2024

జగిత్యాల: డీసీఆర్బీ ఎస్‌ఐ సస్పెండ్

image

జగిత్యాల డీసీఆర్బీ ఎస్సై వెంకట్రావును సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం తెలిపారు. కొడిమ్యాల పోలీసు స్టేషన్‌లో ఎస్ఐగా చేసిన సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని వచ్చిన ఆరోపణపై విచారణ చేపట్టారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా ఎస్సై వెంకట్రావును సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్పీ వివరించారు.

News March 24, 2024

ధర్మపురిలో కన్నుల పండువగా లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం

image

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం బ్రహ్మ పుష్కరిణిలో లక్ష్మీ నరసింహ స్వామి వారి తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. స్వామివారి తెప్పోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు.

News March 24, 2024

రామగుండం: రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం లభ్యం

image

పెద్దపెల్లి జిల్లా రామగుండం పరిధిలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దంపేట, రామగుండం మధ్యలో రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

News March 24, 2024

గంజాయి ఇస్తూ బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు

image

జగిత్యాల జిల్లాలో మైనర్ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. సదరు బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గంజాయి ఇచ్చి ఏడాదిగా అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని, వారిపై పోక్సోతో పాటు NDPS ACT కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

News March 24, 2024

కరీంనగర్: టికెట్ ఎవరి ‘చేతి’కో

image

కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కోసం అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితో పాటు వెలిచాల రాజేందర్‌రావు పేరు వినిపిస్తోంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే స్థానానికి ప్రవీణ్ రెడ్డి పోటీచేయాల్సి ఉండగా.. పొన్నం కోసం వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో ఆయనకు ఎంపీ టికెట్ కేటాయించడానికి అధిష్ఠానం యోచించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల పరంగా చూసుకుంటే రెడ్ల ఎక్కువ టికెట్లు వెళ్తుండటం ఇతరులకు టికెట్ ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది.