Karimnagar

News March 24, 2024

కరీంనగర్: భారీగా పెరగనున్న ఎండలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ రోజు నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. వచ్చే 5 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని అన్నారు. ఎండలు పెరగనున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయని అధికారులు తెలయజేశారు.

News March 24, 2024

KNR: ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓ యువకుడు ఈతకు వెళ్లి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ధర్మోరకు చెందిన శివకుమార్ (19) తన మిత్రుడి బర్త్ డే కు చిట్టాపూర్ వచ్చాడు. తన మిత్రులతో కలిసి శనివారం గ్రామశివారు చెరువు వద్ద గల బావిలోకి ఈతకు వెళ్ళాడు. శివకుమార్‌కు ఈత రాకపోవడంతో బావిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News March 24, 2024

జగిత్యాల: అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష

image

గొల్లపల్లి మండలం దట్నూరుకు చెందిన హరికృష్ణ A/S హరీష్ కిరాణం నిర్వహిస్తుండేవాడు. సరుకుల కోసం వచ్చే బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పగా 2022 ఏప్రిల్ 7న పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. శనివారం నేరం రుజువు కావడంతో JGL న్యాయమూర్తి నీలిమ ఒక్కోకేసులో 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా, ముగ్గురు బాలికలకు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు.

News March 24, 2024

మంత్రి పొన్నం ఆత్మ గౌరవ స్టార్: వొడితల ప్రణవ్ 

image

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేశం స్టార్ కాదని.. ఆత్మగౌరవ స్టార్ అని హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వోడితల ప్రణవ్ తెలిపారు. ఆత్మగౌరవ స్టార్ కాబట్టే.. స్వరాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. మంత్రిని భర్తరఫ్ చేయించే అర్హత, విమర్శించే స్థాయి కౌశిక్‌కు ఉందా అని ప్రశ్నించారు. మంత్రిని పట్టుకొని పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తారా..? అలా మాట్లాడడం ఎమ్మెల్యే అహంకారానికి నిదర్శనమన్నారు.

News March 24, 2024

దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి: కౌశిక్ రెడ్డి

image

బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరారని, ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో నాగేందర్‌ పేరు ఉందని, వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఇటీవల అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కలిశామని కౌశిక్ రెడ్డి చెప్పారు.

News March 23, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుదర్శన్ సస్పెండ్. @ కొండగట్టు అంజన్న ఆలయ ఈవో వెంకటేష్ సస్పెండ్. @ చందుర్తి మండలంలో బస్సు ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు. @ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్. @ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ. @ జగిత్యాల జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురి అరెస్ట్.

News March 23, 2024

జగిత్యాల: కానిస్టేబుల్ సస్పెండ్

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుదర్శన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో అలసత్వం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో జరిగిన ఓ ఘటనలో బాధితుడి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

News March 23, 2024

కొండగట్టు ఈవో వెంకటేశ్ సస్పెన్షన్

image

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం ఈవో వెంకటేశంను సస్పెండ్ చేస్తూ శనివారం దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టు టెండర్ల సొమ్ము గోల్ మాల్ విషయంలో ఇటీవల విచారణ చేపట్టారు. ఈ విషయంలో పలువురు ఉద్యోగులకు మెమోలు జారీ చేయగా, పర్యవేక్షణ లోపం (విధుల పట్ల నిర్లక్ష్యం) కారణంగా ఈఓ సస్పెన్షన్‌కు గురయ్యారు. కాగా కరీంనగర్‌ అసిస్టెంట్ కమిషనర్‌‌కు అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం.

News March 23, 2024

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి: కొప్పుల ఈశ్వర్

image

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం రామగుండం మున్సిపల్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చందర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఆరోపించారు.

News March 23, 2024

పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో కరీంనగర్ టాప్

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌‌లో భాగంగా  నిర్వహించిన పోషణ పక్షోత్సవాలు శనివారం ముగిశాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు ప్రాజెక్టు, మండల, గ్రామ స్థాయిలో ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.కార్యక్రమ వివరాలను సూచించే ఆన్‌లైన్‌ సైట్‌లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.