India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ డీపీవో వీర బుచ్చయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి పందిళ్ల రాజు, వేములవాడ రూరల్ మండలం నెమలి గుండపల్లి పంచాయతీ కార్యదర్శి హరి ప్రసాద్‌లను సస్పెండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు హాజరు కావట్లేదని పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామానికి చెందిన రటపు నరహరి(55) అనే వ్యక్తి దైవ దర్శనానికి వచ్చి శుక్రవారం రాత్రి స్థానిక మంగళ ఘాట్ వద్ద నిద్రిస్తుండగా, గుండెపోటుతో నిద్రలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ధర్మపురి ఎస్సై తెలిపారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను, ఇతర పన్నుల రాయితీ చెల్లింపు మార్చి 31 వరకు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఉమ్మడి KNR జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఇప్పటివరకు సగం వాటిలో 80% వరకు పన్ను వసూళ్లు జరిగాయి. ప్రభుత్వం ప్రకటించిన 90 వడ్డీ రాయితీతో చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్నులు చెల్లిస్తున్నారు. KNR నగరంలో ఇటీవల ఓ వ్యక్తి 24 ఏళ్ల పెండింగ్ బకాయిలు చెల్లించారు.
సిరిసిల్లలో శుక్రవారం <<12902064>>మహిళ దారుణ హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. CI రఘుపతి ప్రకారం.. వేములవాడ మండలానికి చెందిన రమ(41) భర్త మూడేళ్ల క్రితం మరణించాడు. దీంతో రమ SRCLలో కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే అనంతనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న బిహార్‌కు చెందిన ఇద్దరు 15 రోజుల క్రితం ఓ మహిళను ఇంటికి తీసుకొచ్చారు. వారే అత్యాచారం చేసి పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన మానకొండూర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దూరుపల్లికి చెందిన పంది జగన్(51)కు రెండెకరాల సాగు భూమి ఉంది. అందులో ఆడ-మగ వరి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పొలంలో పుద్దు దులుపుతుండగా.. ఎండ వేడి వల్ల జగన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం KNR ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు.
ఉమ్మడి KNR జిల్లా వాసులను ఉష్ణోగ్రతలు కలవరపెడుతున్నాయి. గత రెండేళ్లుగా వేసవిలో రాష్ట్ర స్థాయి అత్యధిక ఉష్ణోగ్రత నమోదు ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రాంతాలే ఉన్నాయి. గత వర్షాకాలంలోనూ సాధారణం కంటే 27% అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. ఇదే తరహాలో జిల్లాలో ఇటీవల వరదలు రావడం, పిడుగులు, రాళ్లవానలు తదితరాలు సంభవించాయి. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మూడవ రోజైన నేడు వైభవంగా కొనసాగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. అనుబంధ ఆలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం నుంచి భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
కారును లారీ వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటన ధర్మపురిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం లక్షెట్టిపేట నుంచి జగిత్యాలకు బంధువుల ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం ఓ ఫ్యామిలీ కారులో వెళుతుండగా ధర్మపురి వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీని స్టేషన్ కు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
మహిళా ప్రయాణికులను ఆర్టీసీ బస్సు నుంచి దింపేసిన ఘటన జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. జగిత్యాల నుంచి ధర్మారం వెళ్లే చివరి బస్సులో ఓవర్ లోడు, టికెట్లు ఇచ్చే మిషన్‌లో ఛార్జింగ్ లేదని మెషిన్ నుంచి టికెట్లు రావడం లేదన్న సాకుతో రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులో 10 మంది మహిళలను ఆర్టీసీ కండక్టర్ దింపినట్లు మహిళలు తెలిపారు. రాత్రి వేళ అని మహిళలు బతిమిలాడడంతో బస్సులో ఎక్కించుకున్నారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 23 చివరి తేదీ అని జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగులు సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉండి ఇంకా దరఖాస్తు చేయని ఉమ్మడి కరీంనగర్ విద్యార్థులు వెంటనే నిర్దేశిత వెబ్‌సైట్ www.tswreis.ac.inలో వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.