India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వివాహ వేడుక భోజనాల విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిన్న మధ్యాహ్నం భోజనాల విషయంలో పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారునికి సంబంధించిన బంధువుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పలువురు గాయాలపాలయ్యారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు మొత్తం 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జగిత్యాల జిల్లా నూతన అదనపు ఎస్పీగా వినోద్ కుమార్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం రోజున బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. అదనపు ఎస్పీ వినోద్ కుమార్ కు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట పలు అధికారులు ఉన్నారు.
గత పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. కరీంనగర్ పార్లమెంటులో 2,181 నుంచి 2,189, నిజామాబాద్ పార్లమెంటులో 1,788 నుంచి 1807కి, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 1,827 నుంచి 1,847కు పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. మొత్తం 5,796 నుంచి 5,843కు 47 కేంద్రాలు పెరిగాయి.
తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌కు హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రితోపాటు సహచర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.
రానున్న ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్‌లోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అక్రమ డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేసే వారిని కట్టడి చేస్తామన్నారు.
పెద్దపల్లి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిని నేడు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించగా.. BJP అభ్యర్థిగా గోమాసే శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇక్కడ బలమైన నాయకుడిని బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో తమ పార్టీ అభ్యర్థి ఎవరోనని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారో కామెంట్ చేయండి.
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే బీ-ఫార్మసీ (సీబీఎస్సీ) 3, 5వ సెమిస్టర్ (రెగ్యులర్, సప్లిమెంటరీ), 4, 6వ సెమిస్టర్ (సప్లిమెంటరీ) పరీక్ష ఫీజు గడువు ఈనెల 30 వరకు ఉందని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో ఏప్రిల్ 3 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
రెండు రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యమవుతోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ను ప్రకటించగా.. BJP అభ్యర్థిగా ఎంపీ బండి సంజయ్ మరోసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
బైకు చెట్టుకు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఎస్సై సురేందర్ కథనం ప్రకారం.. గోపాల్‌రావుపేటకు చెందిన అరవింద్‌తో కలిసి రాకేశ్(21) మంగళవారం రాత్రి తన బావ బర్త్‌డే వేడుకలు జరుపుకొన్నారు. అక్కడి నుంచి చొప్పదండిలో భోజనం చేసేందుకు ఇద్దరు బైకుపై లక్ష్మీపూర్ మీదుగా బయలుదేరారు. వెంకట్రావుపల్లి శివారులో అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు. క్షతగాత్రులను KNR ఆస్పత్రిలో చేర్పించగా.. అప్పటికే రాకేశ్ మృతి చెందాడు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే తనిఖీ చేసి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ కమిషనరేట్‌లో 63 కేసులు నమోదు చేసి రూ.4.25 కోట్లు పట్టుకున్నారు. ఈ నెల 16న ప్రతిమ హోటల్‌లో పట్టుబడిన రూ.6.67 కోట్లను ఎన్నికల కోడ్ కింద పోలీసులు, IT అధికారులు సీజ్ చేసిన విషయం విదితమే.
Sorry, no posts matched your criteria.