Karimnagar

News March 20, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ చెక్ పోస్ట్ వద్ద 2,53,000 నగదు సీజ్. @ కరీంనగర్ రూరల్ స్టేషన్ ఏఎస్సై కిషన్ గుండెపోటుతో మృతి. @ ఓదెల మండలంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి. @ పెద్దపల్లి మండలంలో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి. @ కమలాపూర్ మండలంలో రైలు నుండి పడి యువకుడికి గాయాలు. @ మల్యాల మండలంలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య.

News March 20, 2024

కరీంనగర్: గుండెపోటుతో ఏఎస్సై మృతి

image

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మార్కొండ కిషన్(59) బుధవారం జ్యోతినగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. కిషన్ పోలీస్ శాఖలో సుధీర్ఘ కాలం పాటు సేవలందించారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియలు వారి స్వగ్రామమైన తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో జరగనున్నాయి.

News March 20, 2024

పెద్దపల్లి: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన జరిగింది. మంగళవారం రాత్రి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో పొలం గట్టుపై విద్యుత్ తీగలు పడ్డాయి. బుధవారం ఉదయం రైతు పొలం పనులకు వెళ్ళగా.. విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు తగిలి రాజయ్య అక్కడికక్కడే మృతి చెందినట్టు గ్రామస్థులు తెలిపారు. ఘటనా స్థలానికి పొత్కపల్లి ఎస్సై చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News March 20, 2024

కరీంనగర్ జిల్లాలో 2,28,905 మంది ఓటర్లు పెరుగుదల

image

మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉమ్మడి జిల్లాలో గడచిన ఐదేళ్లలో 2,28,905 మంది ఓటర్లు పెరిగారు. కరీంనగర్ పరిధిలో 1,37,499 ఓటర్లు, పెద్దపల్లి పార్లమెంటు రామగుండం, మంథని, పెద్దపల్లి, ధర్మపురి అసెంబ్లీలలో 57,287, నిజామాబాద్ పరిధిలోని కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో 34,119 మంది ఓటర్లు పెరిగారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 2,28,905 మంది ఓటర్లు పెరిగారు.

News March 20, 2024

వేములవాడలో ఈనెల 27 నుంచి శివ కళ్యాణోత్సవాలు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో ఈనెల 27న శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు శ్రీ శివ కళ్యాణోత్సవాలు జరపనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 30న(శనివారం) సాయంత్రం శ్రీ స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అర్చకులు తెలిపారు.

News March 20, 2024

గోదావరిఖనిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

కుటుంబ వివాదంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన GDKలో జరిగింది. వన్ టౌన్ SI రవీందర్ వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి షెహజాద్.. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో ఉపవాస దీక్షలో ఉన్నాడు. అయితే యువకుడు ఆహారం తీసుకున్న విషయంలో కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి వివాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

News March 20, 2024

GDK: వేలం వైపు.. సింగరేణి చూపు

image

సింగరేణి సంస్థ విస్తరించిన ప్రాంతాల్లో నేరుగా వేలంలో పాల్గొని బొగ్గు గనులను దక్కించుకోవడానికి యాజమాన్యం కసరత్తు చేస్తుంది. 4 ఉమ్మడి జిల్లాల్లో 12వేల మిలియన్ టన్నుల నిక్షేపాలను సింగరేణి గుర్తించి, కొత్తగా 20 గనుల వరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. MMDC చట్టం ప్రకారం ఏ సంస్థ అయినా వేలం ద్వారానే కొత్త గనులను పొందాల్సి ఉండటంతో సింగరేణి, మిగతా సంస్థలతో పోటీపడి గనులను దక్కించుకునే అవకాశం ఉంది.

News March 20, 2024

GREAT.. KNR: ఇద్దరికి ప్రతిభా, ఐదుగురికి కీర్తి పురస్కారాలు

image

ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించిన అవార్డులకు ఉమ్మడి KNR జిల్లాకు చెందిన ఐదుగురు కీర్తి, ఇద్దరు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈమేరకు HYDలో ఈనెల 20, 21న కీర్తి పురస్కారాలు, 28న ప్రతిభా పురస్కారాలను అందుకోనున్నారు. అన్నవరం శ్రీనివాస్, గండ్ర లక్ష్మణ్ రావుకు ప్రతిభా పురస్కారం లభించగా.. మధుసూదన్ రెడ్డి, గోపాల్, సేనాధిపతి, శ్రీనివాస రాజు, సంతొశ్ బాబుకు కీర్తి అవార్డులు లభించాయి.

News March 20, 2024

ఇబ్రహీంపట్నం: మాజీ భర్తపై యాసిడ్‌తో దాడి

image

మాజీ భర్తపై యాసిడ్ దాడి జరిగిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో జరిగింది. ఎస్సై అనిల్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేశ్‌కు, మెట్‌పల్లికి మండలానికి చెందిన మాస లక్షణతో 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరు 2023లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో మహేశ్ మరో పెళ్లికి సిద్ధమవుతుండగా.. మంగళవారం లక్షణ, మహేశ్‌ ఇంటికెళ్లి అతనిపై యాసిడ్ దాడి చేసింది. దీంతో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

News March 20, 2024

ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు: జిఎం

image

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్య అభివృద్ధి కోర్సులలో శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించినట్లు ఆర్జి-3 జిఎం సుధాకర్ రావు, ఏపీఏ జిఎం వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30 వరకు సింగరేణి పరిసర ప్రాంతాల యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.