India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగిత్యాల MLA సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ MLC జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు ఇంటికి వెళ్లారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారు కోరినట్లు సమాచారం. 40 ఏళ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని.. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితులతో జీవన్‌రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ప్రథమ స్థానంలో నిలిచింది. జగిత్యాల జిల్లాలో 2,476 (65.57 %) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కరీంనగర్‌లో 5,922 (62.71%), సిరిసిల్ల 1,204 (59.28%), పెద్దపల్లి 1,527 (55.09%) మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతినే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆమెను బదిలీ చేసి సిరిసిల్ల కలెక్టర్‌గా ఉన్న అనురాగ్ జయంతిని బదిలీపై కరీంనగర్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా అనురాగ్ జయంతిని ఖైరతాబాద్ GHMC కార్యాలయంకు జోనల్ కమిషనర్‌గా బదిలీ చేసి పమేలా సత్పతిని కరీంనగర్ కలెక్టర్‌గా నియమించారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఊహించనివిధంగా ఆయన పార్టీ మారడంతో బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా విస్తుపోతున్నాయి. ఈ విషయంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికీ సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేస్తునట్లు సమాచారం. దీంతో జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారట.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ గంభీరావుపేట మండలంలో గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి. @ రాయికల్ మండలంలో మైనర్ బాలికపై వృద్ధుడి అత్యాచారం. @ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో లారీ డ్రైవర్ పై దాడి. @ చొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. @ వేములవాడ రాజన్నను దర్శించుకున్న హైకోర్టు జస్టిస్.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టమాట ధరలు అమాంతం పెరిగాయి. రెండు రోజులుగా మార్కెట్లో కిలో ధర రూ.100కి చేరుకోవడంతో ప్రజలు వాటిని కొనడానికి ఆసక్తి చూపడం లేదు. మార్కెట్లో డిమాండ్‌కు సరిపడా టమటా లేకపోవడంతో ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కిలో టమాటా రూ.20 నుంచి రూ.30 పలకగా.. ఒక్కసారిగా హోల్ సేల్‌లో రూ.80, రిటైల్ లో రూ.100కు ధర చేరడంతో ప్రజలు కొనలేకపోతున్నారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శనిగరం మహేశ్ కుమార్(45) ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతుల్లో ఆయన ZPHS(B) గంభీరావుపేట గణితం స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాడు. మహేశ్ ఆకస్మిక మృతి పట్ల పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు, మండల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ASF జిల్లా దహేగాంలో మానకొండూరుకి చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. CI రాజ్ కుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయికిరణ్ ఏప్రిల్ 18న సిద్దిపేటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో మే 2న భార్య అనుష పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో పనిచేసిన చోట పోలీసులు విచారించగా అక్కడ పనిచేసే సునీత, భర్త శ్రీనివాస్, తండ్రి, మేనమామ కలిసి చంపి బావిలో పడేసినట్లు తెలిపారు.
శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈక్రమంలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన 16 మంది విద్యార్థులు డిబార్ అయినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలు తెలిపారు. విద్యార్థులు సక్రమంగా పరీక్షలు హాజరుకావాలని ఆయన సూచించారు.
బదిలీపై వెళ్తున్న కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాను, అడిషనల్ కలెక్టర్ నుంచి కలెక్టర్‌గా ప్రమోషన్ పై వెళ్తున్న దివాకరను జగిత్యాలలో శనివారం ఘనంగా సన్మానించారు. అలాగే ఇటీవల నూతనంగా జగిత్యాల కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సత్యప్రసాద్‌ను, ఎస్పీ అశోక్ కుమార్‌లకు స్వాగతం పలికి సత్కరించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.