India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరెంట్ స్తంభం పడి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జరిగింది. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో చెట్లు, పొల్స్ విరిగిపడ్డాయి. ఎలుసాని ఎల్లయ్య (50) అనే వ్యక్తి కరెంట్ పోల్ పక్కనే ఉన్నాడు. భారీ ఈదురుగాలికి పోల్ విరిగి మెడపై పడింది. దీంతో అతని మెడపై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.
@ జగిత్యాలలో బిజెపి విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ. @ ఓదెల మండలంలో డాన్స్ చేస్తుండగా గుండెపోటుతో యువకుడు మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో విద్యుత్ షాక్ తో చేపలు పట్టిన వ్యక్తులపై కేసు. @ వేములవాడ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి. @ పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జగిత్యాల, కరీంనగర్ కలెక్టర్లు. @ మల్యాల మండలంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి స్వామి గుడి చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గుడి చెరువు పనులను సోమవారం అయన క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి పరిశీలించారు. వచ్చే నెల ఆఖరిలోగా పనులను పూర్తిచేయాలని టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు. శివార్చన స్టేజ్ నిర్మాణ పనులను పరిశీలించి ఈఈకి పలు సూచనలు చేశారు.
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పుట్టి శ్రవణ్ అనే విద్యార్థి పుట్టెడు దుఃఖంలో పదవ తరగతి పరీక్ష రాశాడు. తండ్రి రవి అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించిన శ్రావణ్ 10వ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాశాడు.
తనకు అధికారం కాపాడుకోవడం కన్నా ప్రజల శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జగిత్యాలలో సోమవారం జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామని, పసుపు ధరను భారీగా పెంచామన్నారు. దేశ ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు.
కరీంనగర్, పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండిసంజయ్, గోమాస శ్రీనివాస్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మెుదలైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించిబోతున్నారని అన్నారు. 400 సీట్లు దాటాలి- బీజేపీకి ఓటేయాలని కోరారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
వివాహ వేడుకలో డాన్స్ చేస్తుండగా వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో స్నేహితుని వివాహ వేడుకల్లో పాల్గొని డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో పడిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్(33)గా గుర్తించారు.
ప్రధాని నరేంద్ర మోదీతోనే భారత్ సురక్షితంగా ఉంటుందని, నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానిగా గెలిపించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాలలో సోమవారం విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. సైనికుడు అభినందన్ ను పాకిస్తాన్ చెర నుండి విడిపించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ దన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ప్రధాని మోదీ హయాంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మోదీ నీతివంతమైన పాలన అందిస్తూ దేశం అన్ని రంగాలలో పురోగమించేలా చేస్తున్నారన్నాని జగిత్యాలలో సోమవారం విజయ సంకల్ప సభలో పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతిమయమేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయలేని పరిస్థితిలో ఉందన్నారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తున్న జగిత్యాల సభ ద్వారా.. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించారు. ‘నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్‌లో జగిత్యాల చేరుకున్న మోదీకి పార్టీనాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది.
Sorry, no posts matched your criteria.