India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి. @ ఎలిగేడు మండలంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. @ ధర్మపురి మండలంలో వ్యవసాయ బావిలో పడి యువకుడి మృతి. @ కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్న జగిత్యాల ఎస్పీ.
హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్‌లో ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుదిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై క్యాబినెట్ మీటింగ్‌లో మంత్రులు చర్చించారు. ప్రభుత్వ విధివిధానాలు సంబంధించి ఏ విషయమైనా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటిస్తారని సీఎం అన్నారు.
రహదారులు, భవనాలశాఖ ఆధ్వర్యంలో ప్రగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం రహదారులు భవనశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిపై చర్చించారు. వర్షాకాలం నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా క్షేత్రస్థాయిలో ఎక్కడైనా మరమ్మతుల అవసరముంటే వెంటనే చేపట్టాలన్నారు.
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. కాగా రెండో రోజు గురువారం జరిగిన పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్వీ శ్రీరంగ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సక్రమంగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
ఈనెల 26 నుంచి బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ పరీక్షలు నిర్వహించనున్నట్లు గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జులై 3 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఉండొద్దన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యూట్రీషన్ కిట్ల పంపిణీ ప్రస్తుతం జరగడం లేదు. జగిత్యాల జిల్లాలో నాలుగు నెలలుగా గర్భిణులకు ఇవ్వాల్సిన కిట్లు అందడం లేదు. గత ఫిబ్రవరి వరకు సజావుగా సాగగా ప్రస్తుతం వాటి ఊసే లేకుండా పోయింది. గతంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లను ఎంసీహెచ్ కిట్లుగా పేరు మార్చిన ప్రభుత్వం వాటిని కూడా అందించకపోవడంతో నిరాశతో ఉన్నారు.
మెట్‌పల్లి పట్టణానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బత్తిని నవదీప్ అనే యువకుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను నవదీప్ కొన్ని రోజులుగా వేధిస్తుండడంతో ఈనెల 12న బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, అతనిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. దీంతో గురువారం అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వివరించారు.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో బైకు, కంటైనర్ ఢీ.. యువకుడి మృతి.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం.
@ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్.
@ చందుర్తి మండలంలో ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
@ రేపు సిరిసిల్లలో పర్యటించనున్న కేటీఆర్.
@ జగిత్యాల జిల్లా జడ్జిని కలిసిన జగిత్యాల ఎస్పి.
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి గురువారం రూ.90,402 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో టికెట్ల ద్వారా రూ.43,864, ప్రసాదాల ద్వారా రూ.28,050, అన్నదానం కోసం రూ.18,488 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తూరులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. స్థానికుల ప్రకారం.. గ్రామంలోని పల్లె దవాఖాన వద్ద గత కొద్ది రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో ఆకులపై కుంకుమ, పసుపు, కోడిగుడ్డు, మిరపకాయలు, నిమ్మకాయలు పెట్టి వెళ్తున్నారు. దీనిని చూసిన స్థానికులు, పల్లె దవాఖానకు వెళ్లే పేషెంట్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Sorry, no posts matched your criteria.