India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఒక్కోరోజు ఒక్కో రూపంలో మహిళలు పూలతో బతుకమ్మను పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగింపు.

నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఆట పాటలతో నిర్వహిస్తారు. మొదటి రోజైన అమావాస్య నాడు ‘ఎంగిలిపూల’ బతుకమ్మను పేరుస్తారు. సాధారణంగా మహాలయ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ మొదలవుతుంది. ఆనాడు ఇంటి యజమాని పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. పిండ ప్రదానం చేయలేని వాళ్లు పెద్దల పేరిట బ్రాహ్మణుడికి సాయిత్యం (వంట సామగ) ఇస్తారు.

ముస్లిం మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ ముస్లిం జేఏసీ నేతలతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములను, ఈద్గా, ఖబ్రస్థాన్ భూములను గుర్తించి, రెవెన్యూ, వక్ఫ్ బోర్డు అధికారుల సమిష్టిగా వాటిని ప్రభుత్వపరంగా పరిరక్షించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై జరిగిన దాడిని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడులు చేయడమేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల మీద దాడులు, నాయకుల అరెస్టులు, అక్రమ కేసులు.. ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్దరణ ఇదేనా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.

@ ధర్మపురి మండలంలో విద్యుత్ షాక్‌తో గేదె మృతి.
@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ వేములవాడలో పర్యటించిన దేవాదాయ, జౌలి చేనేత శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ముందస్తు బతుకమ్మ సంబరాలు.
@ జగిత్యాల కలెక్టరేట్లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం.
@ వేములవాడ ఏరియా ఆసుపత్రికి మూడవసారి కాయకల్ప అవార్డు.

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.82,779 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.45,632, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.20,000, అన్నదానం రూ.17,147 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో కోరుట్లకు చెందిన జిందం అజయ్‌కుమార్ జిల్లా మొదటి ర్యాంకు సాధించాడు. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ విభాగంలో 80.3 మార్కులతో జగిత్యాల జిల్లా టాపర్‌గా నిలిచాడు. దీంతో ఆయన్ను బంధుమిత్రులు, స్నేహితులు అభినందిస్తున్నారు.

జగిత్యాల జిల్లాలోని దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం నియమించి వాటిని నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా ప్రాసిక్యూషన్‌లో భాగంగా కోర్టు వారు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్లను నిందితుడిపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుచేయడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.

@ కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క.
@ హుజురాబాద్‌లో డెంగ్యూతో బాలిక మృతి.
@ ముస్తాబాద్ మండలంలో స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేపటినుండి డీఎస్సీ అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్.
@ జాతీయ కరాటే పోటీలలో సత్తా చాటిన మెట్పల్లి విద్యార్థులు.
@ చందుర్తి మండలంలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య.
Sorry, no posts matched your criteria.