Karimnagar

News June 19, 2024

ధర్మపురి: నేటి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,08,321 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.63,010, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.35,000, అన్నదానం రూ.10,311 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News June 19, 2024

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం

image

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు హనుమంతరావు, సంపత్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే తరానికి మార్గదర్శి రాహుల్ గాంధీ అని కొనియాడారు.

News June 19, 2024

కరీంనగర్ ఒక ఎమోషన్: స్మిత సబర్వాల్

image

కరీంనగర్ జిల్లాలో గతంలో కలెక్టర్‌గా పనిచేసిన స్మిత సబర్వాల్‌కు ట్విటర్(X) వేదికగా ‘కరీంనగర్ స్మార్ట్ సిటీ అప్డేట్స్’ ప్రొఫైల్ నుంచి అడ్మిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీనిపై స్మిత సబర్వాల్ స్పందించారు. ‘Karimnagar is an emotion’ అంటూ రీట్వీట్ చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు అని రాసుకొచ్చారు.

News June 19, 2024

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌పై కేసు

image

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుల్‌పై గన్ చూపెట్టి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. భవాని సేన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

News June 19, 2024

భూపాలపల్లి జిల్లాలో కీచక ఎస్ఐ!

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ కీచక ఎస్ఐ లైంగిక వేధింపుల ఆరోపణ వెలుగులోకి వచ్చాయి. కాటారం సబ్‌‌డివిజన్‌లోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహిళ కానిస్టేబుల్ ను లైంగికంగా వేధించేవాడని ఆమె ఫిర్యాదు చేసింది. కాగా సదరు ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు సమాచారం. ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ డీఎస్పీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

News June 19, 2024

కరీంనగర్ కలెక్టర్ బదిలీ ఆగినట్లేనా?

image

కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పమేల సత్పతి కొనసాగనున్నారా ? కొత్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి బాధ్యతలు తీసుకోరా? అనే చర్చ అధికార వర్గాల్లో కొనసాగుతుంది. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశాల్లో ప్రస్తుత కలెక్టర్ పమేల సత్పతి పాల్గొనడంతో బదిలీ ఆగిందనే చర్చ కలెక్టరేట్ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తోంది.

News June 19, 2024

హుస్నాబాద్‌లో హత్య UPDATE

image

హుస్నాబాద్(M) కూచన్‌పల్లి వాసి నరసయ్య(55)ను <<13460938>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. SI మహేశ్ వివరాలు.. నర్సయ్య సామగ్రి ఏరుకుంటూ విక్రయించేవాడు. మద్యానికి బానిసై రోజు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి అతని భార్య లేచి చూసేసరికి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులతో మాట్లాడి నర్సయ్య భార్య, తమ్ముడి కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 19, 2024

పోలీసు అధికారులు బాధ్యతగా కృషి చేయాలి: CP

image

సమగ్ర విచారణతో నేరస్తులకు న్యాయస్థానం ద్వార శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు బాధ్యతగా కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్‌లో మంచిర్యాల జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CP మాట్లాడుతూ.. వర్టికల్స్ సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు. బాధితుల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలన్నారు. సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం, భరోసా కలిగించాలన్నారు.

News June 18, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రాయికల్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య.
@ ఇబ్రహీంపట్నం మండలంలో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య.
@ వేములవాడలో కురిసిన భారీ వర్షం.
@ కరీంనగర్ రూరల్ మండలంలో విద్యుత్ షాక్‌తో నాలుగు ఆవులు మృతి.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో మహిళా అదృశ్యం.
@ రేపు కరీంనగర్‌కు రానున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్.
@ బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్.

News June 18, 2024

బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల ఎస్పీ

image

జగిత్యాల జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన అశోక్ కుమార్ మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.

error: Content is protected !!