India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

DSC 2008 అభ్యర్థుల కల ఎట్టకేలకు సాకారం కానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఈడీతో డీఎస్సీ రాసి ఉద్యోగాలు రానివారు 220కి పైగా అభ్యర్థులున్నారు. అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ వెబ్‌సైట్ పొందుపరిచినట్లు DEO జనార్ధన్‌రావు పేర్కొన్నారు. ఈ జాబితాలోని అభ్యర్థులు అక్టోబర్ 4 వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల వరకు సర్టిఫికెట్లను పరిశీలన చేసుకోవాలని సూచించారు.

మల్యాల రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లబ్ధిదారులకు అందజేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. త్వరలో తులం బంగారం హామీ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అందరికీ పడుతుంది కదా అని అడగగా? చాలా మంది తమకు పడటం లేదని చెప్పడంతో 2 నెలలు ఆగండి.. అందరికీ పడుతాయన్నారు.

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.84,148 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.30,366, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.32,670, అన్నదానం రూ.21,112 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

కొండగట్టులో ఈనెల 29న అర్చకులకు సన్మానం నిర్వహించనున్నారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొండగట్టులోని బృందావనంలో సాంస్రృతిక కార్యక్రమాలు, చర్చాగోష్ఠితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలు ఆలయాల అర్చకులకు సన్మానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఎ.ఉజ్వల, కొండలరావు తెలిపారు. విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.
@ రాష్ట్రస్థాయిలో జగిత్యాల కలెక్టర్‌కు తృతీయ బహుమతి.
@ బుగ్గారం మండలంలో చెరువులో పడి పశువుల కాపరి మృతి.
@ ధర్మారం మండలంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.
@ ఇల్లంతకుంట మండలంలో కస్తూర్బా బాలికల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్.
@ మెట్పల్లిలో నిబంధనలు పాటించని పానీపూరి బండ్లకు జరిమానా.
@ ప్రవాసి ప్రజావాణి ప్రారంభించిన పొన్నం ప్రభాకర్.

ప్రవాసి ప్రజావాణి(గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం) ప్రత్యేక కౌంటర్ శుక్రవారం ప్రారంభమైంది.
రిబ్బన్ కట్ చేసి ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్‌ను హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ… బతుకమ్మ పండుగకు ముందు 9, 5,3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ గ్రామంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.

జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నరసింహ ఆన్‌లైన్ సెంటర్ యజమాని దసరా పండుగను పురస్కరించుకుని వెరైటీ లక్కీ డ్రా ఏర్పాటు చేశాడు. రూ.50 చెల్లించి టోకెన్ తీసుకోవాలని, లక్కీ డ్రా అక్టోబర్ 12న ఉ.9 గంటలకు తీయనున్నట్లు తెలిపారు. ఇందులో మొదటి బహుమతి మేకపోతు, రెండవ బహుమతి కింగ్‌ఫిషర్ బీర్ కాటన్, మూడో బహుమతి కోడిపుంజు అని ఐదు బహుమతులు ఏర్పాటు చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి మూలమలుపు వద్ద ఓ డీసీఎం వ్యాను టైర్లు ఊడిపోగా.. పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డికి చెందిన ఆయిల్ లోడుతో వ్యాన్ జగిత్యాలకు వెళుతోంది. రాగట్లపల్లి మూలమలుపు వద్దకు రాగానే డివైడర్‌కు తగిలిన డీసీఎం వ్యాన్ వెనుక టైర్లు ఊడిపోయి ఓ వైపు ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అప్రమత్తతో డీసీఎం వేగాన్ని అదుపు చేసి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలం పోరండ్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చింతల లక్ష్మారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. వారితో పాటు ఉపాధ్యాక్షుడు నీలం సుదర్శన్, నాయకులు గొల్ల లక్ష్మణ్, గడ్డం రమేష్, బొజ్జ పర్శయ్య తదితరులున్నారు.
Sorry, no posts matched your criteria.