India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియలో భాగంగా ఆయనను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల నూతన ఎస్పీగా ప్రస్తుత మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మండలంలోని రుద్రారంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కొయ్యూరు పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన నిశాంత్(30) ఇంటి ఆవరణంలోని మోటార్ వైరును సరి చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు భూపాలపల్లిలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి గత నాలుగు నెలల క్రితమే వివాహమైంది.
కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్‌లో మునిగి రాంనగర్‌కు చెందిన విజయ్ అనే ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందాడు. ఎల్ఎండీ వద్ద కూతురు సాయినిత్య, కుమారుడు విక్రాంత్ ఫొటో దిగుతుండగా రిజర్వాయర్లో పడ్డారు. ఈ క్రమంలో వారిని కాపాడబోయిన విజయ్ నీటిలో మునిగి మృతి చెందాడు. కాగా, విజయ్ పిల్లలను జాలరి శంకర్ కాపాడారు. కాగా, మృతుడు అసిఫాబాద్ జిల్లాలో పే అండ్ అకౌంట్లో పని చేస్తున్నాడు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ ఈనెల 20న కరీంనగర్‌కి రానున్నట్లు బిజెపి నేతలు తెలిపారు. 21, 22వ తేదీల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గానికి ఒక ప్రముఖ దేవాలయం దర్శనం చేసుకుంటారని తెలిపారు. కేంద్ర మంత్రి హోదాలో మొదటి సారి కరీంనగర్‌కి రానున్న నేపథ్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు బిజెపి నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. బాధితులకు ఎక్స్‌గ్రేషియా పరిహారం అందిస్తామన్నారు.
ఆస్తి తగాదాలతో కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలు.. కోరుట్ల మండలం మోహనరావుపేటకు చెందిన తండ్రి గంగరాజన్, కుమారుడు రాజేశ్(32) మధ్య ఆదివారం రాత్రి ఆస్తి విషయంలో వివాదం జరిగింది. ఈ క్రమంలో గొడవ మరింత పెరిగి గంగరాజన్ రాజేశ్‌ను కత్తితో దాడి చేశాడు. వెంటనే రాజేశ్‌ను HYD తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. గంగరాజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
HYD నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో విద్యా సంవత్సరానికి డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమో కోర్సుల్లో చేరడానికి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రాము యాదవ్ తెలిపారు.ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ ద్వారా ఫీజుల్లో రాయితీ కల్పించడానికి ఈ నెల 23న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైనా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాకు వలస వచ్చిన కూలీల బతుకులు అత్యంత దుర్భరంగా మారుతున్నాయి. ఇటుక బట్టీలు, రైస్ మిల్లులో పని చేసే వలస కూలీలకు కనీస వసతులు కరవయ్యాయి. సుల్తానాబాద్ ప్రాంతంలోనీ ఓ ఇటుక బట్టీలో పనిచేసే నిండు గర్భిణిని కరీంనగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పురిటి నొప్పులు అధికం కావడంతో KNR బస్టాండులోనే పురుడు పోసుకోవడంతో వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో నిదర్శనంగా నిలుస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వచ్చే 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్IPS(IG) సూచించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధి పెద్దపల్లి -మంచిర్యాల జిల్లాలోని ముస్లిం కుటుంబాలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా పండుగల సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి వదంతులు నమ్మవద్దన్నారు. 15 రోజుల నుంచి కమిషనరేట్‌లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఆవుల అక్రమ రవాణాను జరగకుండా చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.