India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కారును లారీ వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటన ధర్మపురిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం లక్షెట్టిపేట నుంచి జగిత్యాలకు బంధువుల ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం ఓ ఫ్యామిలీ కారులో వెళుతుండగా ధర్మపురి వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీని స్టేషన్ కు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
మహిళా ప్రయాణికులను ఆర్టీసీ బస్సు నుంచి దింపేసిన ఘటన జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. జగిత్యాల నుంచి ధర్మారం వెళ్లే చివరి బస్సులో ఓవర్ లోడు, టికెట్లు ఇచ్చే మిషన్‌లో ఛార్జింగ్ లేదని మెషిన్ నుంచి టికెట్లు రావడం లేదన్న సాకుతో రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులో 10 మంది మహిళలను ఆర్టీసీ కండక్టర్ దింపినట్లు మహిళలు తెలిపారు. రాత్రి వేళ అని మహిళలు బతిమిలాడడంతో బస్సులో ఎక్కించుకున్నారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 23 చివరి తేదీ అని జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగులు సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉండి ఇంకా దరఖాస్తు చేయని ఉమ్మడి కరీంనగర్ విద్యార్థులు వెంటనే నిర్దేశిత వెబ్‌సైట్ www.tswreis.ac.inలో వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
గత నాలుగు రోజులుగా మల్హర్, కాటారం మండలాల పరిధిలో ఆకాశంలో అత్యంత సమీపంలో చక్కర్లు కొడుతున్న జెట్ విమానం ప్రజలను అయోమయానికి గురి చేసిన విషయం విధితమే. అయితే జెట్ విమానంపై అధికారులు అరా తీయగా ఎట్టకేలకు సమాచారం తెలిసింది. ఛత్తీస్‌గడ్‌లోని కాంకేడ్ ఎయిర్ పోర్ట్ అకాడమీలో పెట్టిన ట్రైనింగ్ నేపథ్యంలో జెట్ ఇక్కడ తిరుగుతున్నట్లు తెలిపారు. దీంతో ఊహాగానాలకు తెరపడింది.
గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారవ.. వెన్నంపల్లి గ్రామానికి చెందిన మారుపాక మహేష్(30) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. మహేష్‌కు గురువారం రాత్రి గుండెలో నొప్పి రావడంతో హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
వేములవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిని సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయానికి ఎస్పీ అఖిల్ మహాజన్ అటాచ్ చేశారు. వేములవాడ పోలీస్ స్టేషన్‌లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులను ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.
ఈనెల 23 నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మూడవ సంవత్సరం ఐదవ సెమిస్టర్ B.SC ప్రయోగ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు కరీంనగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి ఆడెపు శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ప్రయోగ పరీక్షల సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరలా 1.గంట నుంచి నాలుగు గంటల వరకు జరుగుతాయని విద్యార్థులు తప్పక హాజరుకావాలని సూచించారు.
సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అనంత నగర్‌కు చెందిన మహిళను ఆమె ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యాచారం చేసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో నిందితుల ఆధార్ కార్డులు, మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరిరంచి దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాల నీటిమట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలకు ప్రాణాధారమైన SRSPలోనూ నీటిమట్టం 19 టీఎంసీలకు పడిపోయింది. అటూ కరీంనగర్ జిల్లాలో సాగు, తాగునీట అవసరాలకు ఆధారపడి ఉన్న LMDలో 5.7 టీఎంసీలకు నీరు చేరింది. దీంతో కరీంనగర్ నగరానికి తాగునీటి కటకట ఏర్పాడనుంది. ఇప్పటికే రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. అటూ చివరి ఆయకట్టుకు నీరందక రైతులు కలవర పడుతున్నారు.
మహిళలు, పిల్లలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. మహిళల కోసం ప్రత్యేక భద్రత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. ప్రయాణాలు, పని ప్రదేశాలు, ఇతర చోట్ల వేధింపులు జరిగితే వెంటనే రక్షణ కోసం షీ టీమ్స్‌కు సంప్రదించాలని సూచించారు. అంతేకాకుండా ఫిర్యాదుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
Sorry, no posts matched your criteria.