Karimnagar

News July 10, 2024

పెద్దపల్లి: ఏడో తరగతి విద్యార్థి మృతి

image

ఏడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. SI సాంబమూర్తి వివరాల ప్రకారం.. ఎలిగేడు మండలానికి చెందిన సదయ్య కుమారుడు శ్రీవత్సవ్‌(13)కు ఒక కన్ను కనిపించకపోవడంతో రేకుర్తిలోని ప్రభుత్వ అందుల పాఠశాలలో ఆరేళ్ల క్రితం చేర్పించారు. అయితే బాలుడు
దుస్తులు ఆరవేసే తీగపై ఉన్న టవల్‌ను మెడకు చుట్టుకొని ఆడుకుంటుండగా మరణించినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News July 10, 2024

సమృద్ధిగా కురవని వర్షాలు.. ఆందోళనలో రైతన్నలు

image

సమృద్ధిగా వర్షాలు కురియకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురవక చెరువులు, బావుల్లో నీరు చేరలేదు. దీంతో రైతులు నాట్లు వేయడానికి ముందుకు రావడం లేదు. KNR మండలంలో 15480 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేసినప్పటికీ 30 శాతం కూడా పంట సాగుకాలేదు. రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తె పోయిన వర్షాలు కురవకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. నీటి సామర్థ్యాన్ని బట్టి రైతులు సాగు చేస్తున్నారు.

News July 10, 2024

మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన వరద

image

మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద పోటెత్తింది. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న బ్యారేజీకి ఇన్‌ఫ్లో 20, 260 క్యూసెక్కులు ఉండగా మంగళవారం ఇన్‌ఫ్లో 35,200 క్యూసెక్కులు పెరిగింది. దీంతో మొత్తం 85 గేట్లు ఎత్తి.. అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ రివర్ బెడ్ లెవల్ సముద్ర మట్టానికి 88 మీటర్లు కాగా.. 89.60 మీటర్ల ఎత్తులో వదర ప్రవహిస్తోంది.

News July 10, 2024

జేఎల్ ఫలితాలు.. మెట్‌పల్లి యువతి రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు

image

ఇటీవల విడుదలైన ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల పోస్టుల ఫలితాల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన యువతి రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు సాధించింది. పట్టణంలోని కళానగర్‌కు చెందిన జనమంచి సాయిశిల్ప ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆంగ్ల విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. గతంలో 4 ఉద్యోగాలు సాధించిన సాయిశిల్ప.. గురుకుల డిగ్రీ ఆంగ్ల అధ్యాపకురాలు పోస్టుల ఫలితాల్లో రాష్ట్రంలోనే రెండో ర్యాంకు సాధించింది.

News July 10, 2024

KNR: డయేరియా నివారణకు కృషిచేయాలి: కలెక్టర్

image

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డయేరియా వ్యాధి నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారులు డయేరియా వ్యాధి బారిన పడకుండా వైద్యాధికారులు ప్రత్యేకచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయేరియా నివారణకు కృషిచేయాలన్నారు. ఈ వ్యాధి నివారణ తీసుకోవాల్సిన చర్యలపై ప్లాష్ మాబ్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు.

News July 9, 2024

కరీంనగర్: అంధుల పాఠశాల విద్యార్థి అనుమానస్పద మృతి

image

కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని అంధుల పాఠశాలలో ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీనికి యాజమాన్యం నిర్లక్ష్యం కారణమంటున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. గదిలో మెడకు తాడు చుట్టుకుని అపస్మారక స్థితిలో కనిపించిన యువకుడి మృతదేహం. పాఠశాల వద్ద విద్యార్థి తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చేపట్టారు.

News July 9, 2024

కరీంనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

కరీంనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానిక సాయినగర్ సాయిబాబా ఆలయం ఎదుట బిక్షాటన చేసే వ్యక్తి మృతిచెందాడు. టూ టౌన్ పోలీసులు వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడు ఎరుపు రంగు డబ్బాల షర్ట్, జీన్ పాయింట్ వేసుకున్నాడు. అతడి వయసు 50 నుంచి 55 ఉండొచ్చిన తెలిపారు. సమాచారం తెలిసిన వారు తమని సంప్రదించాలని వారు తెలిపారు.

News July 9, 2024

KNR: డ్రగ్స్ నియంత్రణపై కలెక్టర్ అవగాహన

image

అధికారులు, ప్రజలు అందరం కలిసి డ్రగ్స్ అనే మహమ్మారిని జిల్లా నుంచి తరిమికొడదామని, డ్రగ్స్ రహిత జిల్లాగా తయారు చేద్దామని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణపై ఎక్సైజ్‌శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అవగాహన సమావేశం నిర్వహించారు. యువత డ్రగ్స్, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యసనాల బారిన పడి యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు.

News July 9, 2024

BREAKING.. KNR: సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడి మృతి

image

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి వద్దకు తల్లితో వచ్చిన బాలుడు.. ఆడుకుంటూ వెళ్లి మూత తెరిచిఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడ్డాడు. కాగా, మృతుడి కుటుంబం MHBD జిల్లాకురవి మండలం సుదనపల్లికి చెందినవారు కాగా.. ఉపాధి నిమిత్తం పెద్దపల్లిలో ఉంటున్నారు.

News July 9, 2024

KNR: ఒకే గదిలో 5 తరగతుల విద్యార్థులు

image

ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంపై ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చిగురుమామిడి మం. లాలయ్యపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1-5 తరగతుల్లో 30 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ స్కూల్‌లో రెండు గదులు ఉండగా ఒకటి శిథిలావస్థకు చేరింది. దీంతో వర్షం పడితే అన్ని తరగతుల విద్యార్థులకు ఒకే గదిలో పాఠాలు చెబుతున్నారు. మిగతా సమయాల్లో బయట చెబుతున్నారు.