India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.86,680 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.41,082, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.35,350, అన్నదానం రూ.13,248 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ కిషన్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి పుష్పగుచ్చం అందజేశారు. అరవింద్ కేంద్రమంత్రికి శుభాకాంక్షలు తెలిపి, మోడీ నాయకత్వంలో బొగ్గు గనుల శాఖ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
వరంగల్ నుంచి నిజామాబాద్ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గురువారం నుంచి డీలక్స్ బస్సులు నడపనున్నట్లు కరీంనగర్ రీజియన్ ఆర్ఎం సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో డీలక్స్ బస్సులను అదనంగా నడుపుతున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో విద్యార్థిని(17) ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన యువతి వారం రోజుల కిందట పెద్దపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదని విచారణ అనంతరం తెలుపుతామని ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ మర్డర్ కేసులో తమకు అన్యాయం జరుగుతుందంటూ మండలంలోని కప్పారావుపేట గ్రామానికి చెందిన గాజుల రాజేందర్ సోదరుడు గాజుల రాకేశ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశాడు. పెట్రోల్ పోసుకుని గంటకు పైగా ఆందోళన చేపట్టారు. నాలుగు రోజుల్లో నిందితులను కచ్చితంగా పట్టుకుంటామని ధర్మపురి సీఐ రామ నరసింహారెడ్డి, ఎస్సై ఉమాసాగర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఒగ్గు పూజారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పట్నం వేసే సమయంలో ఒగ్గు పూజారులు రూ.300 ఇస్తేనే పూజ చేసి కంకణం కడతామని డిమాండ్ చేశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆలయ ఈఓ స్పందిస్తూ.. పూజారులు డబ్బులు డిమాండ్ చేసినట్లు భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఒగ్గు పూజారుల యూనియన్‌తో మాట్లాడి ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బడిబాట. @ తంగళ్ళపల్లి మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య. @ ఎల్లారెడ్డిపేట సెస్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. @ కరీంనగర్ లో సినీ నటుడు గోపీచంద్ జన్మదిన వేడుకలు. @ కొండగట్టు అంజన్న ను దర్శించుకున్న జగిత్యాల ఎస్పీ. @ జగిత్యాల జిల్లాలో బడిబాటలో పాల్గొన్న కలెక్టర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ ఇన్‌ఛార్జి కమిషనర్ అమ్రపాలి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తంగా చేసి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి బడి గంట మోగనుంది. 48 రోజుల వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు ఆటపాటలకు గుడ్‌బై చెప్పి బడిబాట పట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా బడులు తెరిచిన మొదటి రోజే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. గంబీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద డీసీఎంను బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కాగా, మృతులు బిక్కనూరు మండలం మల్లుపల్లె వాసులు షేక్ అబ్దుల్లా, ఎస్ డి చందాగా గుర్తించారు. బైకుపై వేములవాడకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జురిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.