Karimnagar

News June 11, 2024

KNR: పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్ల అడ్డంకి!

image

పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ప్రధాన అడ్డంకిగా మారాయి. గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పంచాయతీరాజ్‌ చట్టం-2018 ఎన్నికల స్థానాలకు రిజర్వేషన్లు పదేళ్లపాటు వర్తిస్తాయని పేర్కొంటోంది. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక ఏమైనా మార్పులు చేస్తుందా? అనే అసక్తి సర్వత్రా నెలకొంది.

News June 11, 2024

KNR: మూగ యువతిపై యాభై ఏళ్ల వ్యక్తి అత్యాచారం?

image

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో దారుణం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూగ యువతిపై అదే గ్రామానికి చెందిన యాభై ఏళ్ల వ్యక్తి సోమవారం అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, సదరు యువతి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 11, 2024

త్వరలో వనదేవతల స్మృతి వనం?

image

మేడారంలో వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మక్క-సారలమ్మల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిపేలా గద్దెల వెనకవైపు ఉన్న 25 ఎకరాల్లో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తోంది. జాతర విశేషాలతో పాటు.. అప్పటి వస్తువులు, వారి గొప్పతనం తెలిపేలా మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. చిలకల గుట్ట సుందరీకరణతో పాటు భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోంది.

News June 11, 2024

KNR: మూడు రోజుల్లో ముగ్గురి మృతి

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వరుస మరణాలు జరుగుతున్నాయి. గత 3 రోజుల్లో ముగ్గురు మృతి చెందారు. శుక్రవారం ఎల్లంపల్లిలో శంకరయ్య(75), శనివారం గుజ్జులపల్లిలో కందుగుల గ్రామానికి చెందిన దినసరి కూలీ శనిగరం మొగిలి(45), ఆదివారం ఘన్పూర్ తండాకు చెందిన డిగ్రీ విద్యార్థి బానోతు ఆంజనేయులు(18) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావుల్లో పడి మృతి చెందారు.

News June 11, 2024

కరీంనగర్‌కు ఇది రెండోసారి!

image

KNR MPగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఆయన హోం శాఖ మంత్రిగా వ్యవహరించనున్నారు. అమిత్‌ షా నేతృత్వంలో సహాయ మంత్రిగా బండి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఉమ్మడి జిల్లాకు ఈ మంత్రిత్వ శాఖ రావడం ఇది రెండోసారి. 1999లో KNR నుంచి గెలిచిన విద్యాసాగర్‌రావుకు ఇదే శాఖను కేటాయించారు. యాదృచ్ఛికంగా ఇద్దరు నాయకులకు రెండోసారి గెలిచిన తర్వాతే హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు.

News June 11, 2024

KNR: సాగులో విత్తన ఎంపిక ప్రధానం

image

వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. తొలకరి పలకరించడంతో పాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాగుకు రైతులు సిద్ధమయ్యారు. పంటల సాగులో మేలైన విత్తనాలు ఎంపిక చేసుకోవడం ఎంతో ప్రధానం. పలు ప్రైవేట్‌ విత్తన కంపెనీలు ఆకర్షణీయ ప్యాకింగ్‌తో, నకిలీ లేబుళ్లతో రైతులను మోసం చేస్తున్నాయి. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తీసుకొని నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి దిగుబడులు సాధించాలి.

News June 11, 2024

KNR: బాలికపై అత్యాచారం.. చివరకు జైలు శిక్ష

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయపూర్తి ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించారు. సీఐ రఘుపతి ప్రకారం.. సిరిసిల్లకు చెందిన పదేళ్ల బాలిక ఇంటికి ఒంటరిగా వెళ్తున్న సమయంలో రాజీవ్‌నగర్‌కు చెందిన రాహుల్ 2023లో అత్యాచారానికి పాల్పడ్డాడు. తప్పించుకొని ఇంటికి వెళ్లిన బాధితురాలు ఇంట్లో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సోమవారం నేరం రుజువయింది.

News June 11, 2024

జగిత్యాల: పాఠశాలలను సిద్ధం చేయాలి: కలెక్టర్

image

పాఠశాలలు పునః ప్రారంభం కానున్న దృష్ట్యా తరగతి గదులు శుభ్ర పరచడం, మౌలిక సదుపాయాలు కల్పన జరగాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పాఠ్య పుస్తకాలను, నోటు పుస్తకాలను సిద్ధం చేయాలన్నారు. యూనిఫామ్స్ అందించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు దివాకర, రాంబాబు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

News June 10, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సైదాపూర్ మండలంలో బావిలో పడి యువకుడు మృతి. @ జగిత్యాల ప్రజావాణిలో 48 ఫిర్యాదులు. @ పెద్దపల్లి ప్రజావాణిలో 43 ఫిర్యాదులు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డిఎంహెచ్వో తనిఖీలు. @ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. @ జిల్లాలో ప్లాస్టిక్ ను నిషేధించాలన్న జగిత్యాల కలెక్టర్. @ మంత్రి సీతక్కతో వీడియో కాన్ఫరెన్స్ లో సిరిసిల్ల అధికారులు.

News June 10, 2024

VMWD: శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి 4గంటల సమయం

image

దక్షిణ కాశీగా పేరొందిన, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి సోమవారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండడంతో రాష్టంలోని వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి 4గంటల సమయం పడుతోంది. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

error: Content is protected !!