Karimnagar

News June 10, 2024

20 ఏళ్లకు మళ్లీ కరీంనగర్‌కు కేంద్రమంత్రి పదవి

image

కరీంనగర్ పార్లమెంటుకు 20 ఏళ్ల తర్వాత కేంద్రమంత్రి పదవి వరించింది. KCR 2004 జనరల్ ఎన్నికల్లో కరీంనగర్ MP స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2004-06 వరకు అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. అంతకముందు 1998, 1999ఎన్నికల్లో గెలుపొందిన సీహెచ్ విద్యాసాగర్‌రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక KNR నుంచి కేంద్రమంత్రి పదవి పొందిన మొదటివ్యక్తిగా సంజయ్ నిలిచారు.

News June 10, 2024

తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటా: బండి సంజయ్

image

కేంద్ర కేబినేట్‌లో చోటు దక్కడం సంతోషంగా ఉందని బండి తెలిపారు. ప్రధాని మోదీ తనకు గొప్ప అవకాశం కల్పించారని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. తనను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.. తెలంగాణ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తానన్నారు.

News June 10, 2024

KNR: విడిపోయిన కుటుంబాన్ని కలిపిన మంత్రి

image

ఎస్ పోతారం గ్రామానికి చెందిన వోడ్నాల భిక్షపతి, శ్రీనివాస్, వెంకటేష్ అనే ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలు 14 ఏళ్ల క్రితం గొడవలతో విడిపోయాయి. ఈ విషయాన్ని స్థానికులు తెలియజేయడంతో ఆదివారం తన పర్యటనలో భాగంగా మంత్రి పొన్నం ముగ్గురు అన్నదమ్ములను కలిపారు. కలిసి ఉంటే కలదు సుఖం అంటూ వారితో మాట్లాడి ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలను కలిపారు. గొడవలు పెట్టుకోకుండా అందరూ కలిసి ఉండాలని వారికి సూచించారు.

News June 10, 2024

KNR: రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు

image

KNR-WGL జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో <<13411201>>ఇద్దరు<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. వివరాలిలా.. శంకరపట్నం(M)కొత్తగట్టుకి చెందిన మహేశ్‌(18), అరవింద్‌చారి(16) బైక్‌పై కేశవపట్నం వస్తున్నారు. ఈ క్రమంలో KNR-HZB వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మహేశ్‌ ఇంటర్మీడియట్‌, అరవింద్‌చారి పదో తరగతి పూర్తి చేశాడు. SI లక్ష్మారెడ్డి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు.

News June 10, 2024

తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్

image

కరీంనగర్ MPగా రెండవసారి గెలిచిన బండి సంజయ్‌ను కేంద్రమంత్రి పదవి వరించింది. కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన బండి.. 2019లో KNR పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచి, ఏడాదిలోపే రాష్ట్ర BJP అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో పార్టీని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై.. 2024లో అదే స్థానం నుంచి ఎంపీగా గెలిచి తొలిసారి కేంద్ర మంత్రి వర్గంలో చోటు సాధించారు.

News June 10, 2024

లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.2,82,459 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,26,500, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.1,04,100, అన్నదానం రూ.51,859 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News June 9, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష.
@ గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు.
@ శంకరపట్నం మండలంలో లారీ, బైకు ఢీ.. ఇద్దరి మృతి.
@ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ.
@ ధర్మారం మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య.

News June 9, 2024

కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

image

KNR జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్-వరంగల్ వెళ్తున్న లారీని.. వెనకాలే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనదారుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 9, 2024

ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే కలిసిన పెద్దపల్లి ఎంపీ వంశీ

image

పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ ఆదివారం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఖర్గేను శాలువాతో సన్మానించి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ప్రజలు గొప్ప అవకాశాన్ని ఇచ్చారని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కేంద్రం నుండి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో గళం విప్పాలని మల్లికార్జున ఖర్గే సూచించారు.

News June 9, 2024

పెద్దపల్లి: డబుల్​ బెడ్​ రూం పంపిణీకి రెడీ

image

పెద్దపల్లిలో డబుల్​ బెడ్​ రూం ఇండ్లను పంపిణీ చేయడానికి MLA విజయరమణారావు రెడీ అయ్యారు. 9ఏళ్ల నుంచి ఇప్పటి వరకు 262 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 1,669 ఇండ్లను కడుతుండగా.. 1,463 ఇండ్లకు పునాదులు తీయలేదు. జిల్లాలోని 14 మండలాల్లో మంథని 92, కాల్వ శ్రీరాంపూర్​లో 170 మాత్రమే పూర్తయ్యాయి. PDPL, సుల్తానాబాద్​, RGM మండలాల్లో నిర్మాణాలు స్లోగా జరుగుతున్నాయి. ధర్మారం(U)​, మంథని(U)​లో స్థలం లేక పనులు చేపట్టలేదు.

error: Content is protected !!