Karimnagar

News June 9, 2024

జగిత్యాల: హత్య చేసిన కేసులో ముగ్గురి అరెస్ట్

image

హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వివరాలిలా.. భూపాలపల్లికి చెందిన రమేశ్ జగిత్యాల జిల్లా ఎండపల్లి (M) గోడిశాలకి చెందిన మల్లేశ్ దగ్గర రూ.2 లక్షలు అప్పుతీసుకున్నాడు. గతంలో వీరికి అప్పు విషయంలో గోడవలు జరిగాయి. ఈక్రమంలో మల్లేశ్, కుమారుడు నాగరాజు, జితేందర్ ముగ్గురు గురువారం భూపాలపల్లిలోని రమేశ్ ఇంటికి వెళ్లి హత్య చేసి పారిపోయారు. కేటీకే 5వ గని వద్ద శనివారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

News June 9, 2024

కాళేశ్వరం వాసులకే ఛైర్మన్‌ పదవి?

image

కాళేశ్వరం దేవస్థానానికి పాలక మండలి నియామకానికి సన్నాహాలు మొదలయ్యాయి. BRS ప్రభుత్వంలో నియామకమైన పాలకమండలి గడువు మార్చి 13న ముగిసింది. రెండేళ్ల క్రితం ఈ క్షేత్రానికి పూర్తిస్థాయి ఈవో నియామకం జరగగా.. 2 నెలల క్రితం బదిలీ అయ్యారు. అయితే పాలకమండలి ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. ఈసారి కాళేశ్వరం వాసులకే ఛైర్మన్‌ పదవి దక్కాలని ఆశిస్తున్నట్లు సమాచారం.

News June 9, 2024

గ్రూప్-1 పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. జిల్లాలో 22 పరీక్ష కేంద్రాల్లో 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. పరీక్షా నిర్వహణకు 386 మంది ఇన్విజిలేటర్లు, 22 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 77 మంది బయోమెట్రిక్ ఆఫీసర్లు తదితరులను నియమించామన్నారు.

News June 8, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామోజీరావుకు ఘన నివాళులు.
@ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామన్న జగిత్యాల కలెక్టర్.
@ సైదాపూర్ మండలంలో అనుమానాస్పద స్థితిలో దినసరి కూలీ మృతి.
@ గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.
@ తంగళ్ళపల్లి మండలంలో షెడ్డు కూలీ రెండు లేగ దూడలు మృతి.
@ కాటారం మాజీ జెడ్పిటిసి మృతి.
@ పెద్దపల్లిలో గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

News June 8, 2024

KNR: అవి చిరుత పాదముద్రలు కాదట!

image

మల్హర్ మండలంలోని గోపయ్యకుంట వాగులో చిరుతపులి సంచారం చేసిందని స్థానికులు కొయ్యూర్ ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో తాడిచెర్ల సెక్షన్ అధికారి లక్ష్మన్, కొయ్యూరు సెక్షన్ అధికారి ఇంతియాజ్, బిట్ అధికారులు చిరుత ఆనవాళ్ల కోసం జల్లెడ పట్టారు. వాగులో గుర్తించిన పాదముద్రలు తోడేలువని నిర్ధారించారు. ప్రజలు, పశువుల కాపర్లు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.

News June 8, 2024

రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి కీలక ఆదేశాలు!

image

2023సంవత్సరంలో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా బదిలీ అయిన జిల్లా పరిధిలోని ఉపాధ్యాయులు తక్షణమే ఈరోజు నూతన పాఠశాలల్లో రిపోర్ట్ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి ఏ.రమేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని మండల విద్యాశాఖ అధికారులు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.

News June 8, 2024

KNR: అత్యాచార నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వెంకటేశ్ తీర్పునిచ్చారు.
HZBకు చెందిన కరుపాక రాజు (19) ఓ బాలిక (7)పై పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలికకు ఆమె తల్లి స్నానం చేయిస్తుండగా విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసునమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20ఏళ్ల జైలు విధించారు.

News June 8, 2024

KNR: కానిస్టేబుల్ ఖాతా నుంచి రూ.1.40 లక్షలు మాయం

image

సైదాపూర్ ఠాణాలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ సెల్ నుంచి రూ.1.40 లక్షలను సైబర్ నేరస్థుడు కాజేశాడు. వివరాలిలా.. సట్ల ఆంజనేయులు సెల్‌కు మే 30న ఆధార్‌కార్డు నంబరుతో సహా ఓటీపీ వచ్చింది. తర్వాతి రోజు రాత్రి సిమ్ పనిచేయలేదు. కస్టమర్ కేర్‌కు ఫోను చేసి తెలుసుకోగా సిమ్ బ్లాక్ అయిందని తెలిసింది. కొత్త సిమ్ తీసుకోగా జూన్5న యాక్టివేషన్ అయ్యింది. అప్పటికే తన ఖాతా నుంచి రూ.1.40 లక్షలు డ్రా అయినట్లు తేలింది.

News June 8, 2024

KNR: రామోజీరావు మృతిపై మంత్రి పొన్నం సంతాపం

image

ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని పేర్కొన్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి పత్రిక, మీడియా, టెలివిజన్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి తెలుగు జాతికి రామోజీరావు గర్వకారణంగా నిలిచారని గుర్తు చేశారు. రామోజీ రావు జీవితం అత్యంత నిబద్ధత, క్రమశిక్షణ పట్టుదలతో బతికిన వ్యక్తి అని అన్నారు.

News June 8, 2024

అందుబాటులో జనుము, జీలుగ విత్తనాలు: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో జనము, జీలుగ, పత్తి విత్తనాలు, యూరియా అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చనిపోయిన రైతు కుటుంబానికి త్వరగా రైతు బీమా అందజేయాలని అధికారులకు సూచించారు. రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ తో రైతులను శాస్త్రవేత్తలతో అనుసంధానించాలని సూచించారు.

error: Content is protected !!