Karimnagar

News June 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు.
@జగిత్యాల రూరల్ మండలంలో ఇంటిపై విరిగిపడ్డ తాటిచెట్టు.
@ఎల్లారెడ్డిపేట మండలంలో ఎస్సైపై తప్పుడు పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు.
@కరీంనగర్‌లో చేప మందు పంపిణీ.
@కథలాపూర్ మండలంలో 12 మంది పేకాటరాయుళ్ల పట్టివేత.
@తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్‌ను కలిసిన పెద్దపల్లి ఎంపీ.

News June 7, 2024

KNR:12, 29, 24, 27వ తేదీల్లో సదరం శిబిరం

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 12, 19, 24, 27వ తేదీల్లో సదరం శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శుక్రవారం తెలిపారు. వినికిడి మూగ(చెవుడు)12న, మానసిక రోగులు 19న, కంటి చూపు 24న, ఆర్దో 27న, మూగ, చెవుడు, మానసిక దివ్యాంగులకు సంబంధిత వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News June 7, 2024

గ్రూప్-I పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో గ్రూప్-I ప్రిలిమినరి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ప్రపుల్ దేశాయ్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. జూన్ 9న జరిగే గ్రూప్-I ప్రిలిమినరి పరీక్ష నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సిలు, పోలీస్ నోడల్ అధికారి, సీఎస్, డిపార్ట్మెంటల్ అధికారులు, ఐడెంటిఫికేషన్ అధికారాలు పాల్గొన్నారు.

News June 7, 2024

గ్రూప్-1 పరీక్ష విజయవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

అధికారులందరూ సమన్వయంతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్ష నిర్వాహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 4699 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇందుకుగాను 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ గౌతమి తదితరులున్నారు.

News June 7, 2024

విత్తనాలు, ఎరువుల కొరత లేదు: అదనపు కలెక్టర్

image

వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ సాగుపై జిల్లాలోని ఏఓలు, ఏఈఓలతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏఓలు, ఏఈఓలు తమ పరిధిలోని రైతులకు అందుబాటులో ఉండాలని, సాగులో మెలకువలు అందించాలని సూచించారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన తరువాత కచ్చితంగా రసీదు తీసుకోవాలని పేర్కొన్నారు. విత్తనాల, ఎరువుల కొరత లేదన్నారు.

News June 7, 2024

SU: 13 వరకు LLB, LLM పరీక్షల ఫీజు గడువు

image

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే LLB నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షలు, LLM నాలుగో సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్ష ఫీజు గడువు ఈ నెల 13 వరకు ఉన్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా.శ్రీరంగప్రసాద్ తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో ఈ నెల 18 వరకు గడువు ఉందని చెప్పారు.

News June 7, 2024

పెద్దపల్లి: కూలర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్‌.. ఒకరి మృతి

image

పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన రైతు నల్ల శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కూలర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాస్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

News June 7, 2024

బీజేపీలో బండి తనదైన మార్క్!

image

కరీంనగర్ నుంచి పలువురు కీలక నేతలు రాజకీయాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. కేంద్రంలో తిరిగి అధికారంలోకి రాబోతున్న BJPలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్‌ రెండోసారి కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికయ్యారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి పార్టీలో కొత్త ఉత్తేజం తీసుకురావడంలోనూ కీలకంగా వ్యవహరించారు. మొదట్లో కార్పొరేటర్‌గా, అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌గా కొనసాగారు.

News June 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోనరావుపేట మండలంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.
@ మల్లాపూర్ మండలంలో పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య.
@ ముత్తారం మండలంలో 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.
@ మెట్‌పల్లి మండలంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.
@ సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం.
@ మహదేవ్పూర్ మండలంలో విద్యుత్ షాక్‌తో 3 పశువులు మృతి.
@ చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు.

News June 6, 2024

పెద్దపల్లి జిల్లాలో విషాదం

image

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దొంగతుర్తి గ్రామానికి చెందిన మ్యాన ఓంకార్ కుమారుడు వేదాన్ష్(4)కు ట్రాక్టర్ తలగడంతో మృతి చెందాడు. వేదాన్ష్ తాత ట్రాక్టర్ తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు వేదాన్ష్‌కు ట్రాక్టర్ తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

error: Content is protected !!