Karimnagar

News June 6, 2024

రేపు మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్న మంత్రి

image

రేపు మధ్యాహ్నం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు. సుందిళ్ల బ్యారేజీలో NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్, ఇతర నీటిపారుదల శాఖ అధికారలు బ్యారేజీల పరిస్థితి వివరించనున్నారు.

News June 6, 2024

రాజన్నను దర్శించుకున్న SBI చీఫ్ జనరల్ మేనేజర్

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కార్పొరేట్ సెంటర్) చీఫ్ జనరల్ మేనేజర్ మంజు శర్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు. ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

News June 6, 2024

KNR: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని కాపాడిన సీఐ

image

ఓ ఫోన్ కాల్ సమాచారంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న ఓ యువతి ప్రాణాలను కాపాడారు. గొడవలతో మనస్తాపానికి గురైన యువతి తన స్కూటీపై గోదావరి నది వద్దకు నిన్న రాత్రి వెళ్లింది. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి సదరు యువతి ఫోన్ లొకేషన్ ద్వారా గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లి యువతిని కాపాడారు. కుటుంబ సభ్యులను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు.

News June 6, 2024

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ రికార్డ్

image

రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికై న వారిలో పెద్దపల్లి ప్రాతినిధ్యం వహించనున్న గడ్డం వంశీకృష్ణ(35) చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. కాగా వంశీకృష్ణ(35) యూఎస్‌లో సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. పోటీ చేసిన మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. ఈయన తండ్రి వివేక్ 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం చెన్నూరు MLAగా ఉన్నారు.

News June 6, 2024

కరీంనగర్: ఎక్సైజ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ సూసైడ్

image

ఎక్సైజ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. CI విజయ్‌కుమార్‌ ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన రవి (54)KNR ఎక్సైజ్‌ అర్బన్‌ స్టేషన్‌లో HCగా పని చేస్తున్నారు. ఇంటి కోసం లోన్‌ తీసుకున్నారు. లోన్‌ కట్టడంలో ఇబ్బంది, పిల్లల చదువుకు డబ్బు సరిపోవడం లేదని 4 నెలల కింద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో ఉంటున్న రవి.. బుధవారం డ్యూటీకి వెళ్లి వచ్చి ఉరేసుకున్నారు. కేసు నమోదైంది.

News June 6, 2024

కేంద్ర మంత్రి వర్గ రేసులో బండి సంజయ్!

image

KNR లోక్‌సభ నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన BJP అభ్యర్థి బండి సంజయ్‌కి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సంజయ్‌ని ఆ పదవి నుంచి తప్పించినప్పుడు మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఆయనకు అవకాశం ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి పెద్దపీట వేశారు. ఇప్పుడు ఆ హోదాతోనే ఆయనకు మంత్రి పదవి రావడం ఖాయమని చెబుతున్నారు.

News June 6, 2024

రాజన్న ఆలయంలో ఘనంగా మహా లింగార్చన పూజ

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం రాత్రి మాస శివరాత్రి సందర్భంగా మహా లింగార్చన పూజా కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా జ్యోతులను లింగాకారంలో వెలిగించి విశేష పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.

News June 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మంథని మండలంలో పిడుగుపాటుకు గేదె మృతి.
@ రాయికల్ మండలంలో రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.
@ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ మోరపల్లిలో బస్సు కిందపడి బాలుడి మృతి.
@ ఓదెల మండలంలో పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య.
@ గ్రూప్ 1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్న జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా మహా లింగార్చన.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

News June 5, 2024

కరీంనగర్: ఒకరికి మోదం.. ఒకరికి ఖేదం!

image

MP ఎన్నికల ఫలితాలు ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ నేతలకు మిశ్రమ స్పందనను మిగిల్చాయి. కరీంనగర్, పెద్దపల్లి కాంగ్రెస్ ఇన్చార్జిలుగా వ్యవహరించిన మంత్రులు అభ్యర్థుల గెలుపు కోసం శాయశక్తుల కృషి చేశారు. అయితే పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపొందడంతో జిల్లాలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి విజయానికి చేసిన కృషి ఫలించలేదు.

News June 5, 2024

దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలనే మోడీకి ఓటేశారు: ఈటల

image

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కారం. దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలన్నా.. ఆత్మగౌరవం నిలబడాలన్నా మోదీకే మా ఓటు అని ప్రజలు వేశారని అన్నారు. అసెంబ్లీలో 15 శాతం ఉన్న ఓటు బ్యాంక్ 35కి పెరిగింది’ అని అన్నారు.  

error: Content is protected !!