India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మేడిగడ్డ బ్యారేజ్‌లో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు భూపరీక్షలు ప్రారంభించారు. బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మట్టి, మెటీరియల్ నమూనాలను సేకరిస్తున్నారు. బ్యారేజ్ కుంగిన పిల్లర్ల వద్ద 25 ఫీట్ల మేర డ్రిల్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. భూభౌతిక, భూ సాంకేతిక పరీక్షలను నిపుణులు పర్యవేక్షిస్తున్నారు.
చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం జన్మదిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక లేఖను విడుదల చేశారు. మేడిపల్లి సత్యం ప్రజాసేవలో నిమగ్నమై నియోజకవర్గ అభివృద్ధి కృషి చేయాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
బస్సు కింద పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మోరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలుడు(4) ఇంటి నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చాడు. ఈ క్రమంలో జగిత్యాల నుంచి కొత్తపేటకు వెళ్తున్న బస్సు కింద పడటంతో నుజ్జునుజ్జుయి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిన్న జరిగిన ఓట్లు లెక్కింపులో ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో పార్టీల వారీగా ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. KNR లోక్‌సభ పరిధిలో బీజేపీకి 5,85,116, కాంగ్రెస్‌కు 3,59,907, బీఆర్ఎస్‌కు 2,82,163 ఓట్లు వచ్చాయి. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్‌కు 4,75,587, బీజేపీకి 3,44,223, బీఆర్ఎస్‌కు 1,93,356 ఓట్లు వచ్చాయి. KNRలో బీజేపీ, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికల్లో BRS ఓటమిని జీర్ణించుకోలేక ఓ కార్యకర్త మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మొగిలిపేట గ్రామానికి చెందిన తుక్కన్న(80) BRS ఓడిపోయిందంటూ కనిపించిన వారి దగ్గరల్లా ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు. కాగా, మృతుడు TRS పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీలోనే క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ సక్సెస్ అవ్వడంతో కొండగట్టు అంజన్న సెంటిమెంట్ కలిసొచ్చిందని ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకొని ‘వారాహి’ వాహనానికి పూజలు చేయించారు. దీంతో ఆంజనేయస్వామి ఆశీస్సులు పవన్‌పై మెండుగా ఉన్నాయని, అంజన్న సెంటిమెంట్ కలిసొచ్చిందని అభిమానులు అంటున్నారు.
పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి BJP అభ్యర్థిగా పోటి చేసిన గోమాసె శ్రీనివాస్ 2 సార్లు ఒకే కుటుంబానికి చెందిన వారి చేతిలో ఓటమిపాలయ్యారు. 2009లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై ఓడిపోయిన ఆయన తాజాగా ఆయన కుమారుడు వంశీకృష్ణపై ఓటమి పాలయ్యారు. 2009లో TRS తరఫున పోటీ చేసిన శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై 49,017 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా ఇప్పడు 1,31,364 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
దేశంలో మోదీ చరిష్మా, రాష్ట్రంలో బండి ఖలేజాతో కరీంనగర్ లోక్‌సభ స్థానంలో బండి సంజయ్ భారీ మెజారిటీతో వరుస విజయాన్ని నమోదు చేశారు. ఈ నియోజకవర్గంలో 1991 తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ అభ్యర్థి రెండో సారి గెలవలేదు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన బండి సంజయ్ తిరిగి 2024 ఎన్నికల్లోనూ రెండో సారి పోటీ చేసి విజయాన్ని అందుకోవడం విశేషం. దీంతో మాజీ MP రత్నాకర్ రావు రికార్డు సమం చేశారు.
లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బోయినపల్లి మండలం మర్లపేట గ్రామానికి చెందిన సాయికృష్ణ తన బైకుపై అత్తగారిల్లు గొల్లపల్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండల కేంద్రంలోకి రాగానే కారును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు.
కరీంనగర్ లోక్‌సభ స్థానంలో బండి సంజయ్ 44.55 శాతం ఓట్లను పొందారు. మొత్తంగా 13,13,331 మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. ఇందులో 5,85,116 మంది బీజేపీకి ఓటేశారు. 2019 ఎన్నికలతో పోలిస్తే సంజయ్‌కు ఓటు శాతం పెరిగింది. అప్పటి ఎన్నికల్లో 11.47 లక్షల ఓట్లకుగానూ 4,98,276 ఓట్లను పొంది 43.42 శాతం మద్దతును పొందారు. మొత్తంగా 2,25,209 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుపై విజయం సాధించారు.
Sorry, no posts matched your criteria.