India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో మంత్రి శ్రీధర్ బాబు మరోసారి తన మార్కు చూపించారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరుపొందిన మంత్రి తన రాజకీయ చతురను ప్రదర్శించి పార్టీ అభ్యర్థి వంశీకృష్ణకు విజయం చేకూర్చారు. తొలుత అభ్యర్థి ఎంపికపై పార్టీలో భిన్న స్వరాలు వినిపించిన మంత్రి అన్నింటిని చక్కదిద్దారు. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులను సమన్వయం చేసి పార్టీ గెలుపునకు కృషి చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ పరిధిలోని స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. పెద్దపల్లిలో అత్యధికంగా 5,711 ఓట్లు పోలవగా.. కరీంనగర్‌లో అత్యల్పంగా 5,438 ఓట్లు పోలయ్యాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చక నోటాకు వేలల్లో ఓట్లు వేశారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నోటాకు ఓట్లు పెరిగాయి. దీనిపై మీ కామెంట్?
@ కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం.
@ పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం.
@ నిజామాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం.
@ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్.
@ ఎండపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.
@ వీణవంక మండలంలో ఎల్లమ్మ ఆలయంలో చోరీ.
@ మల్హర్ మండలంలో తాటి చెట్టు పై పడిన పిడుగు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటితో ఉత్కంఠ వీడింది. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో మొత్తం 28 మంది పోటీ చేయగా.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 2,12,017+ ఓట్లతో గెలుపొందారు. ఇక పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి మొత్తం 42 మంది పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ 131,581+ ఓట్లతో గెలిచారు. దీంతో నేటితో జిల్లాలోని ఎంపీ స్థానాలపై ఉత్కంఠకు తెర పడింది.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ లక్షకు పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అతనిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతం ఓట్లు బండి సంజయ్ కుమార్ సాధించారు. కాంగ్రెస్‌కు 27.4 శాతం, బీఆర్ఎస్‌కు 21.4 శాతం ఓట్లు వచ్చాయి. మరోవైపు కరీంనగర్‌లో కేసీఆర్, వినోద్ రికార్డులు బద్దలు కొట్టారు. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో అత్యధిక ఓట్ల శాతాన్ని సాధించి టాప్‌లో నిలిచారు.
పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ వెల్లడించారు. కాంగ్రెస్‌కు 5,407, BJPకి 5,116, BRSకి 1,416 ఓట్లు వచ్చాయన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 291 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడని తెలిపారు.
కరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఎస్ ఆర్ఆర్ కాలేజీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్టిఫికెట్‌ను ఆయనకు అందజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్ ఎంపీగా గెలిపించడానికి బీజేపీ కార్యకర్తలు గత మూడు నెలలుగా కష్టపడ్డారని, నా గెలుపును కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అత్యధిక మెజారిటీ సాధించారు. 2006 ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు 2 లక్షల 1 వెయ్యి 581 ఓట్లు, 2014లో వినోద్ కుమార్‌కు 2 లక్షల 5 వేల 7 ఓట్లు మెజారిటీ రాగా.. మరో 4 రౌండ్లు ఉండగానే కేసీఆర్, వినోద్ రావు రికార్డులను బండి సంజయ్ బద్దలు కొట్టారు.
Sorry, no posts matched your criteria.