India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో గంటల తరబడి క్యూలైన్ భక్తులు వేచి చూశారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో కరీంనగర్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BJP నుంచి బండి సంజయ్, BRS నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రోజున విషాదం నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామడుగు మండలం వెలిచాలకు చెందిన సత్తవ్వ VMWD మండలం శాత్రాజ్ పల్లి ZPHSలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ముగించుకొని తిరిగి స్కూటీపై ఇంటికి వెళుతుండగా వెలిచాల క్రాస్ వద్ద HZB డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
పెద్దపల్లి జిల్లాలో హత్య జరిగింది. స్థానికుల వివరాలు.. ధర్మారం మండలం కటికెనపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రేండ్ల నరేశ్ కొత్తగా ఇంటిని నిర్మించుకుంటున్నారు. అక్కడ సమీపంలోని ఓ షెడ్డులో ఉంటూ పనులు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో చీకటి పడ్డాక ఇద్దరు వ్యక్తులు పదునైన ఆయుధంతో దాడి చేయగా.. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచి నేవూరి వెంకట్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాకారానికి సోనియాగాంధీ కారణమని ఆమె ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో BRSలో చేరారు.దీంతో ఆలయ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆయన హస్తం గూటికి చేరుకుని ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
లోకసభ ఎన్నికల లెక్కింపు జూన్ 4న జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుచేస్తూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు 4న ఉదయం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఐదుగురికి మించి గుమికూడరాదని తెలిపారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. @ సుల్తానాబాద్ మండలం లో అగ్ని ప్రమాదంలో గడ్డి కట్టలు దగ్ధం. @ గంగాధర మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రధానోపాధ్యాయురాలికి తీవ్రగాయాలు. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షం. @ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ.
ఓ బర్రె దూడను చిరుత తినేసిన ఘటన కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామంలో జరిగింది. బాధిత రైతు లక్ష్మినర్సు తెలిపిన వివరాలు.. సత్యనారాయణ పల్లె వద్ద తన పొలంలో ఏర్పాటు చేసుకున్న షెడ్‌లో రైతు రోజు మాదిరిగానే దూడను కట్టేశాడు. శనివారం రాత్రి సమయంలో షెడ్‌లోకి ప్రవేశించిన ఓ చిరుత బర్రె దూడపై దాడి చేసి కళేబరాన్ని అక్కడే వదిలేసి వెళ్లింది. ఆదివారం షెడ్‌కు వెళ్లిన రైతు దూడపై చిరుత దాడి చేసినట్లు గుర్తించారు.
కరీంనగర్, పెద్దపల్లిలో బీఆర్ఎస్ గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో బీఆర్ఎస్‌కు 11, బీజేపీకి 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరో స్థానంలో గెలుస్తాయని అంచనా వేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్‌కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది. కాగా కరీంనగర్లో బీజేపీ, పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుస్తుందని మెజారిటీ సర్వేల్లో వెల్లడైంది.
స్వరాష్ట్ర సాధనలో ఉమ్మడి కరీంనగర్ కీలక పాత్ర పోషించింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఇక్కడి నుంచి మొదలు పెట్టిన ఆమరణ దీక్ష మలి దశ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచింది. 2004లో అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన సభలోనే సోనియాగాంధీ తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తామన్నారు. సుల్తానాబాద్ చౌరస్తాలో మహాదీపాన్ని దాదాపు 1600 రోజులపాటు వెలిగించి ఉద్యమ ఆకాంక్షను చాటారు.
Sorry, no posts matched your criteria.