India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ కొండగట్టులో వైభవంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు. @ రామగిరి మండలంలో వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి. @ మహదేవపూర్ మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. @ సిరిసిల్లలో ఫర్టిలైజర్ షాపులలో తనిఖీలు నిర్వహించిన ఎస్పీ. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు. @ సిరిసిల్ల జిల్లా పంచాయతీ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్. @ విద్యుత్ దీప కాంతుల్లో సిరిసిల్ల కలెక్టరేట్.
పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం రాత్రి కొండగట్టులో సహస్ర దీపాలంకరణ ఘనంగా నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో అర్చకులు, అధికారులు కలిసి దీపాలు వెలిగించారు. కాగా, ఇవాళ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు వేడుకలు నిర్వహించగా, ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో అర్జిత సేవల రద్దు ఈ నెల 3 వరకు కొనసాగించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.
పెద్దపల్లి పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ పోటీ చేశారు. BJP నుంచి గోమాస శ్రీనివాస్, BRS నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో టఫ్ ఫైట్ ఉందని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, BRS నుంచి వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు. కాగా ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో బీజేపీ స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
పెద్దపల్లి పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ పోటీ చేశారు. BJP నుంచి గోమాస శ్రీనివాస్, BRS నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
కరీంనగర్ పార్లమెంట్ స్థానం బీజేపీదే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, BRS నుంచి వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో బీజేపీదే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద సోనియా గాంధీ గుడి ముస్తాబవుతోంది. ఆదివారం తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా ఊరురా సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో సోనియాగాంధీ గుడి వద్ద సంబరాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీశ్ రెడ్డి తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. శనివారం జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్ మండలం కోల్వైలో 45.5°C, ధర్మపురి మండలం జైనలో 45.3°C, కోరుట్ల మండలం ఐలపూర్ లో 45.0°C, రాయికల్ మండలం ఆల్లిపూర్‌లో 44.7°C, కోరుట్లలో 44.3°C, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట్ లో 44.6°C, కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం ఈదులగట్టుపల్లిలో 43.6°C, పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో 42.7°C ఉష్ణోగ్రత నమోదైంది.
రామగుండం NTPC అన్నపూర్ణ కాలనీకి చెందిన ఈదునూరి కిశోర్ వడదెబ్బతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఫౌండేషన్ ప్రతినిధులు శ్రవణ్ కుమార్, లింగమూర్తి, సానా రామకృష్ణా రెడ్డి, రమేశ్, బీష్మాచారి, వాసు, చంద్రశేఖర్, శశికళ, శారద, లక్ష్మీనారాయణ ఉన్నారు.
కొండగట్టు అంజన్న క్షేత్రంలో జరుగుతున్న పెద్ద జయంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ముందుగా స్థానిక హరిత హోటల్‌లో నేసిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే స్వామివారికి సమర్పించారు. అనంతరం యాగశాలలోని వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని తిలకించారు. అర్చకులు ఆశీర్వదిoచి, తీర్థ ప్రసాదం అందజేశారు. ఇక్కడ ఎంపీపీ రవళి, ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, సతీశ్ రెడ్డి, అనిల్ ఉన్నారు.
Sorry, no posts matched your criteria.