Karimnagar

News June 23, 2024

మానకొండూరులో అదృశ్యం.. కొమురం భీమ్ జిల్లాలో హత్య

image

ASF జిల్లా దహేగాంలో మానకొండూరుకి చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. CI రాజ్ కుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయికిరణ్ ఏప్రిల్ 18న సిద్దిపేటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో మే 2న భార్య అనుష పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో పనిచేసిన చోట పోలీసులు విచారించగా అక్కడ పనిచేసే సునీత, భర్త శ్రీనివాస్, తండ్రి, మేనమామ కలిసి చంపి బావిలో పడేసినట్లు తెలిపారు.

News June 23, 2024

కరీంనగర్: డిగ్రీ పరీక్షల్లో 16 మంది డిబార్

image

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈక్రమంలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన 16 మంది విద్యార్థులు డిబార్ అయినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలు తెలిపారు. విద్యార్థులు సక్రమంగా పరీక్షలు హాజరుకావాలని ఆయన సూచించారు.

News June 23, 2024

జగిత్యాల: జిల్లా అధికారులకు ఆత్మీయ సన్మానం

image

బదిలీపై వెళ్తున్న కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాను, అడిషనల్ కలెక్టర్ నుంచి కలెక్టర్‌గా ప్రమోషన్ పై వెళ్తున్న దివాకరను జగిత్యాలలో శనివారం ఘనంగా సన్మానించారు. అలాగే ఇటీవల నూతనంగా జగిత్యాల కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సత్యప్రసాద్‌ను, ఎస్పీ అశోక్ కుమార్‌లకు స్వాగతం పలికి సత్కరించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

News June 22, 2024

కరీంనగర్ జిల్లా TOP NEWS

image

☞సిరిసిల్లలో స్కానింగ్ సెంటర్లను డిప్యూటీ డిఎంహెచ్ఓ తనిఖీ
☞ చొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం
☞మేడిపల్లి: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
☞గంభీర్రావుపేట: నకిలీ గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్
☞పెద్దపల్లి తాహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ
☞మెట్ పల్లి సీఐగా నిరంజన్ రెడ్డి

News June 22, 2024

హరీశ్ రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలి: జీవన్ రెడ్డి

image

మాజీ మంత్రి హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి రాజీనామా పత్రం సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తన రాజీనామాతో సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంట బీమా చెల్లిస్తుందని, వరికి 500 బోనస్ చెల్లిస్తామన్నారు. విప్ అడ్లూరి లక్ష్మణ్, తదితరులున్నారు.

News June 22, 2024

జగిత్యాల: ఉరివేసుకొని యువకుడు మృతి

image

ఉరి వేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో జరిగింది. ధర్మపురి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడి ధనుంజయ్ (22) హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు. ఈనెల 18న వైజాగ్‌కు ఓ వివాహానికి వెళ్లి ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 22, 2024

రైతులకు స్వీట్లు తినిపించిన వేములవాడ ఎమ్మెల్యే

image

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేయడం హర్షనీయమని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈరోజు కథలపూర్ మండలం తాండ్రియాల్ గ్రామంలో రైతులతో కలసి ఆది శ్రీనివాస్ మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

News June 22, 2024

జగిత్యాల: ఏసీబీ అధికారులు రావడంతో .. SI పరార్!

image

జగిత్యాల జిల్లా రాయికల్ లో ఏసీబీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఎస్ఐ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన ఎస్ఐ అక్కడి నుంచి పారిపోయారు. పట్టుకున్న ట్రాక్టర్‌ను విడిపించే విషయంలో ఎస్ఐ బాధితుల నుంచి రూ.25 వేలు డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు ఎస్ఐపై కేసు నమోదు చేశారు.

News June 22, 2024

చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, తన భార్య కలిసింది ఇక్కడే

image

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే, రూపాదేవి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుకునే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారికి ఇద్దరు పిల్లలు యోజిత్ (11), రుషికశ్రీ(8). కాగా ఆమె ఉపాధ్యాయురాలు. రెండు నెలల క్రితమే వారు హైదరాబాద్‌కు రాగా ఈ ఘటన జరిగింది.

News June 22, 2024

KNR: డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్

image

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఆరుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు. విద్యార్థులు సక్రమంగా పరీక్షలు హాజరుకావాలని ఆయన సూచించారు.